- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KGBV: కేబీబీవీలో అమానుషం.. విద్యార్థినుల జుట్టు కత్తిరించిన హాస్టల్ ఇంచార్జ్
దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు కీచకులుగా మారుతున్నారు. మొన్నటికి మొన్న హెయిర్ కట్ (Hair Cut) సరిగా చేయించుకోలేదని ఓ ప్రొఫెసర్ (Professor) విద్యార్థికి ఏకంగా గుండు కొట్టించారు. ఆ ఘటన మరువక ముందే విశాఖపట్నం జిల్లా (Vishakhapatnam District) జి.మాడుగల (G.Madugula) మండల కేంద్రంలోని కేజీబీవీ (KGBV)లో అమానుషం చోటుచేసుకుంది. పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని హాస్టల్ ఇంచార్జ్ ప్రసన్న కుమారి (Prasanna Kumari) ఏకంగా 15 మంది విద్యార్థినుల జట్టు కత్తిరించింది. ప్రస్తుతం ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పాఠశాలకు ఆలస్యంగా వచ్చనంత మాత్రాన జట్టు కత్తిరించడం ఏంటని విద్యార్థినుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఇంచార్జ్ ప్రసన్న కుమారిని విధుల నుంచి వెంటనే తప్పించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.