Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, 12 మందికి గాయాలు

by Shiva |   ( Updated:2024-11-18 03:20:42.0  )
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, 12 మందికి గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన ప్రకాశం జిల్లా (Prakasam District) కేశినేనిపల్లి (Keshinenipally) వద్ద సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆర్టీసీ బస్సు (RTC Bus)ను టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టగా.. అదే లారీని మరో లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆర్టీసీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరు క్లీనర్లతో సహా 12 మందికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. టిప్పర్ డ్రైవర్ అజాగత్త, అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టు‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story