ఒకే రోజు.. ఒకే గ్రామంలో.. రెండు హత్యలు..

by Sumithra |
ఒకే రోజు.. ఒకే గ్రామంలో.. రెండు హత్యలు..
X

దిశ, ఆమనగల్లు : రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం నాగిళ్ళ గ్రామంలో ఒకే రోజు రెండు హత్యలు జరగడం సంచలనంగా మారింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగిళ్ళ గ్రామానికి చెందిన బర్కము యాదయ్య (58) పది సంవత్సరాల క్రితం భార్యను గొడ్డలితో హతమార్చిన కేసులో జైలుకు వెళ్లి సంవత్సరం కిందట బయటకు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఆదివారం నాగిళ్ల గ్రామంలో జరిగిన శుభకార్యంలో పాల్గొనేందుకు యాదయ్య భార్య సోదరుడు యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన గడ్డం శ్రీను (38)హాజరయ్యాడు.

ఈ క్రమంలో గడ్డం శ్రీను తన బావ యాదయ్యను పరామర్శించడానికి వెళ్ళగా ఆ సమయంలో యాదయ్య బావమరిది శ్రీను పై గొడ్డలితో దాడి చేయడంతో బామ్మర్ది శ్రీను అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న శ్రీను కుటుంబీకులు బంధువులు నాగిళ్ల గ్రామానికి చేరుకొని జరిపిన దాడిలో యాదయ్య కూడా మృతి చెందినట్లు సమాచారం. ఇలా ఒకే రోజు ఒకే గ్రామంలో రెండు హత్యలు జరగడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed