- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rajaiah: కడియం శ్రీహరిని పర్వతగిరికి పంపే వరకు నిద్రపోను.. రాజయ్య హాట్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari), బీఆర్ఎస్ (BRS) నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య (Thatikonda Rajaiah) మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. దేవనూరు అటవీ భూముల (Devanur Forest Lands)ను కబ్జా చేశారంటూ రాజయ్య (Rajaiah) ఇటీవలే ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే రాజయ్యకు శ్రీహరి సవాల్ విసిరారు. దేవనూరు అటవీ భూముల కబ్జా ఆరోపణలు నిజమని నిరూపిస్తే.. తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలుగుతానని ప్రకటించారు. అదేవిధంగా దళితబంధులో రాజయ్య (Rajaiah) అవినీతికి పాల్పడినట్లుగా నిరూపిస్తే.. పాలిటిక్స్ నుంచి తప్పుకోవాలని అన్నారు.
అయితే, తాజాగా కడియం శ్రీహరి (Kadiyam Srihari) సవాలును రాజయ్య స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) స్థానికేతరుడని అన్నారు. ఆయనను పర్వతగిరికి పంపే వరకు నిద్రపోనని కామెంట్ చేశారు. ఎంపీ ఎన్నికల్లో కడియం రూ.100 కోట్లపైనే ఖర్చు చేశారని ఆరోపించారు. ఆ రూ.100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో ముందు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఉప ఎన్నికల్లో కడియం శ్రీహరి (Kadiyam)ని ఓడించి తీరుతానని రాజయ్య ధీమా వ్యక్తం చేశారు.