- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రూ.500 కోట్ల ఇనాం భూములు స్వాహా..!
దిశ, రంగారెడ్డి బ్యూరో : మహేశ్వరం నియోజకవర్గం హైదరాబాద్‌ను ఆనుకొని ఉంది. దీంతో బహుళ స్థాయి కంపెనీలు వచ్చాయి. బాలాపూర్, మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. బాలాపూర్, మహేశ్వరం, కందుకూరు మండలాల్లో ఎకరా రూ.5 - 10 కోట్ల ధర పలుకుతున్నది. అక్రమార్కులు, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెవెన్యూ శాఖ అధికారుల అండదండలతో ప్రభుత్వ, అసైన్డ్, భూధాన్, లావాణి పట్టా, ఇనాం, దేవాదాయ, చెరువు శిఖం భూములను దర్జాగా కబ్జాలు చేస్తున్నారు. మహేశ్వరం మండలంలోని తుమ్మలూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 145 - 150 వరకు సాయి ప్రియ వెంచర్ యాజమాన్యం 2006 సంవత్సరంలో డీటీసీపీ వెంచర్ చేసింది. హెచ్ఎండీఏ పేరుతో ఫేస్-2 వెంచర్ చేసింది.
అయితే 2008లో సర్వే నెంబర్ 148/ఆలో 12.34 ఎకరాలు దస్తుగర్ధన్ ఇనాం భూమి అని అప్పటి పహాణిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇనాం భూమిని పట్టా భూమిగా మారకున్న సాయి ప్రియ వెంచర్ నిర్వాహకులు కొనుగోలు చేశారు. సర్వేనెంబర్ 145లో 15.38 ఎకరాలు, 146లో 15.1 ఎకరాలు, 147లో 19.18 ఎకరాలు, 148లో 15.26 ఎకరాలు, 149లో 17.15 ఎకరాలు, 150లో 16.18 ఎకరాలు కలిపి మొత్తం సుమారు 100 ఎకరాలు దస్తుగర్ధన్ ( తిమ్మాజీ చెరువు సెరుబా ఇనాం) ఇనాం భూముల్లో సాయి ప్రియ వెంచర్ యాజమాన్యం సర్వేనెంబర్ 145 - 150 ఇనాం భూముల్లోనే డీటీసీపీ, హెచ్ఎండీఏ పేరుతో వెంచర్ చేశారు. 145 - 150 సర్వే నెంబర్లలో దస్తుగర్ధన్ ఇనాం భూములకు ఎలాంటి ఓఆర్సీలు జారీ కాకుండానే పట్టా భూములుగా మార్చారు. నేటికీ ధరణిలో సర్వే నంబర్ 150 ఆ/2లో దస్తుగర్ధన్ ఇనామ్ భూమి అని చూపిస్తుంది. ప్రస్తుతం ఎకరాభూమి రూ.5 కోట్ల ధర పోతున్నది. 100 ఎకరాల ఇనాం భూముల విలువ బహిరంగ మార్కెట్లో రూ.500 కోట్లు ధర పలుకుతున్నది.
కందుకూరు ఆర్డీవో కార్యాలయంలో కనిపించని ఓఆర్సీల జారీ రికార్డు..
కందుకూరు ఆర్డీవో కార్యాలయం నూతనంగా ఏర్పడి సుమారు ఏడు సంవత్సరాలు గడుస్తున్నది. అయినా నేటికీ కందుకూరు ఆర్డీవో కార్యాలయంలో భూములకు సంబంధించిన కొన్ని రికార్డులు కనిపించడం లేదు. ఆర్డీవో కార్యాలయం ఏర్పడి ఏడేళ్లు గడుస్తున్నా ఓఆర్సీ జారీ రికార్డు లేకపోవడం గమనార్హం. మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని 145-150 సర్వే నంబర్లలో ఓఆర్సీలు జారీ చేశారా ? అని ఆర్డీవో కార్యాలయంలో వివరణ అడిగితే.. పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. గతంలో ఉన్న గోషామహల్ ఆర్డీవో కార్యాలయంలో రికార్డులు ఉంటాయి. తాము ఓఆర్సీ జారీ చేసిన నంబర్ చెబితే అక్కడి నుంచి తెప్పిస్తాం కానీ తమ దగ్గర ఓఆర్సీలు జారీ చేసిన రికార్డులు లేవని పొంతన లేని సమాధానం చెబుతున్నారు. తుమ్మలూరు గ్రామంలో ఏఏ సర్వే నెంబర్లలో ఇనాం భూముల వివరాలు కోరినా రిజిస్ట్రార్ లేదనే సమాధానం చెబుతున్నారు.
ఓవర్సీలు జారీ కాకుండానే పట్టాలుగా మార్పు..?
తుమ్మలూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 145 - 150 ఇనాం భూములకు ఎలాంటి ఓవర్సీలు జారీ చేయకుండానే పట్టా భూములుగా మార్చారు. ప్రస్తుతం 145 - 150 సర్వేనంబర్‌లో సాయిప్రియ వెంచర్ యాజమాన్యం వెంచర్ చేసింది. ఇనామ్ భూములను అప్పటి రెవెన్యూ శాఖ అధికారులు ఏ విధంగా పట్టా భూమిగా మార్చారో ఆ శాఖ అధికారులే తెలియాలి.
పట్టా భూమిగా మార్చాలంటే..
ఇనాం భూములను పట్టా భూములుగా మార్చాలంటే వాస్తవంగా ఉన్న ఇనాందారులకు, నాలుగు రకాల కౌలుదారుల పేర్ల మీద లేకపోతే వారి వారసుల మీద మాత్రమే ఓఆర్సీలు (అక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్) తీసుకున్న తర్వాతే పట్టా భూములుగా మార్చాలి. కానీ 145 - 150 సర్వే నెంబర్లు వాస్తవంగా ఉన్న ఇనామ్ దారుల, కౌలుదారుల పేరు మీద ఓవర్సీలు జారీ కాకుండానే పట్టా భూములుగా మార్చారు. హైదరాబాద్ రాష్ట్రంలో 1955లో ఇనామ్ భూములన్నీ పట్టా ప్రభుత్వ భూములుగా మారాయి. 1973వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఇనాం భూములను వాస్తవంగా సాగుచేసుకుంటున్న ఇనాందారులకు, అనుభవంలో ఉన్న కౌలుదారులకు, వారి వారసులకు ఓఆర్సీలు ఇవ్వాలని ప్రభుత్వం ఓ చట్టం తీసుకొచ్చింది. ఓవర్సీలు తీసుకొని పట్టా భూమిగా మార్చే అవకాశం కల్పించారు. సాయి ప్రియ వెంచర్ నిర్వాహకులు మాత్రం 100 ఎకరాల దస్తుగర్ధాన్ ఇనామ్ (తిమ్మాయి చెరువు సెరుబా ఇనాం) భూముల్లో దర్జాగా వెంచర్ చేశారు. ప్రస్తుతం ఎకరా భూమి రూ.5 కోట్ల ధర పలుకుతున్నది. సుమారు రూ.0500 కోట్ల ఇనాం భూములకు ఎసరు పెట్టారు.
సాయిప్రియ పై అధికారులకు ఎందుకంత ప్రేమ..?
సర్వే నంబర్ 144లో తిమ్మాయి చెరువు 34.05 ఎకరాల సర్కారీ భూమి ఉంది. 145, 148, 149 సర్వేనంబర్లు చెరువు ఎఫ్టీఎల్ సగభాగం ఉంది. ఎఫ్టీఎల్ పరిధి ఉన్నా ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ సాయి ప్రియ వెంచర్ పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సాయి ప్రియ వెంచర్ అక్రమాల పై తిమ్మాయి చెరువు శిఖం కబ్జా, ఇనాం భూములు కబ్జా అని దిశలో వరుస కథనాలు వస్తున్నా సాయి ప్రియ వెంచర్ పై రెవెన్యూ శాఖ, ఇరిగేషన్ శాఖ అధికారులు చర్యలు తీసుకోకుండా ప్రేమ చూపిస్తున్నారు తప్ప సాయి ప్రియ వెంచర్‌లో జరిగిన అక్రమాల పై చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ప్రొహిబిటెడ్‌లో ఉన్న క్రయ విక్రయాలు..?
సాయిప్రియ వెంచర్‌లో పలు సర్వేనంబర్లు ప్రొహిబిటెడ్ జాబితాలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్లాట్లు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ప్రొహిబిటెడ్‌లో జాబితాలో ప్లాట్లకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు ఏ విధంగా జరుగుతున్నాయో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులే తెలపాలి.