Aghori: ఏపీలో అఘోరీ అరాచకం.. జర్నలిస్టు, పోలీసులపై దాడి

by Rani Yarlagadda |
Aghori: ఏపీలో అఘోరీ అరాచకం.. జర్నలిస్టు, పోలీసులపై దాడి
X

దిశ, వెబ్ డెస్క్: అఘోరీ.. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేస్తున్న టాపిక్ ఇది. ఆమె పేరేంటో తెలీదు. ఊరేంటో తెలీదు. ఎక్కడి నుండి వచ్చిందో తెలీదు. ఏం చేస్తుందో అంతకన్నా తెలీదు. అందరికీ తెలిసిందల్లా ఒక్కటే.. ఆమె చెప్పింది నమ్మడం. శివ భక్తురాలిని అని, అఘోరీ మాతను అని తనని తాను ప్రపంచానికి పరిచయం చేసుకుంది. అసలు ఈమె మీడియా ముందుకు ఎలా వచ్చిందో కానీ.. శరీరంపై దుస్తులు లేకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆలయాల్లో తిరుగుతూ హల్ చల్ చేస్తుంది. తనను ఆపేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే చనిపోతానని బెదిరింపులు కూడా చేసింది.

కొద్దిరోజుల క్రితం మహిళలు అలా నగ్నంగా తిరగకూడదని ఆమెకు ఎవరో ఎర్రటి వస్త్రాన్ని కట్టారు. రెండు మూడ్రోజులైనా ఆ వస్త్రాన్ని శరీరంపై ఉంచుకోలేదామె. ఏమైనా అంటే.. నేను అఘోరిని అంటుంది. నిజంగా అఘోరినే అయితే.. ఇలా ఎవరిని పడితే వారిని కొట్టి, తిడతారా? తాజాగా ఏపీలో ఓ జర్నలిస్టు, పోలీసులపై దాడి చేసింది.

నిన్నటి వరకూ తెలంగాణలో ఉన్న అఘోరి.. నేడు ఏపీలో ప్రత్యక్షమైంది. తన కారును వాష్ చేయిస్తుండగా.. ఓ జర్నలిస్ట్ ఆమెను వీడియో తీశాడన్న నెపంతో ఇష్టమొచ్చినట్లు దాడి చేసింది. అనంతరం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం వద్దకు చేరుకుని.. హల్ చల్ చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను కలవాలని జాతీయ రహదారి (National Highway)పై బైఠాయించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దాంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. వెహికల్ ఎక్కు అని మహిళా పోలీసు ఆమెను లేపగా.. అక్కడే గలీజు పనులు చేసి.. పోలీసులపై తిరగబడింది. తాను రానంటే రానని దాడి చేసింది. అసలు ఎక్కడి నుంచి వచ్చిందీమె అని అక్కడున్న వారంతా ఫైర్ అవుతున్నారు.

Advertisement

Next Story