AP Cabinet: ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా

by Rani Yarlagadda |   ( Updated:2024-11-18 03:12:32.0  )
AP Cabinet: ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: నేడు జరగాల్సిన ఏపీ కేబినెట్ (AP Cabinet Meeting) సమావేశం వాయిదా పడింది. సీఎం చంద్రబాబు నాయుడి సోదరుడు.. నారా రామ్మూర్తి (Nara Rammurthy) రెండ్రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేసింది ప్రభుత్వం. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు మంత్రి వర్గ సమావేశం జరుగుతుందని ఏపీ సర్కార్ వెల్లడించింది.

నేడు అసెంబ్లీలో కీలక బిల్లులు

నేటి అసెంబ్లీ సమావేశాల్లో సభ ముందుకు కీలక బిల్లులు రానున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం.. మంత్రి నారాయణ అనంతపురం, హిందూపూర్ అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ వార్షిక ఆడిట్ రిపోర్టు, 2017-18, 2018-19 సంవత్సరాల్లో ప్రభుత్వ రిపోర్టులను ప్రవేశపెట్టనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2024, మంత్రి నారాయణ ఏపీ మున్సిపల్ లా సవరణ బిల్లు 2024, మంత్రి సత్యకుమార్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సవరణ బిల్లు 2024, ఏపీ ఆయుర్వేదిక్, హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2024, ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2024, మంత్రి అనగాని సత్యప్రసాద్ ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లు 2024, మంత్రి అచ్చెన్నాయుడు ఏపీ కో ఆపరేటివ్ సొసైటీస్ సవరణ బిల్లు 2024ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

Advertisement

Next Story

Most Viewed