- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిస్టరీగా మారిన హర్షవర్థన్ మిస్సింగ్ కేస్..
దిశ, మల్కాజిగిరి : మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని పదమూడేళ్ల బాలుడి మిస్సింగ్ కేసు మిస్టరీగా మారుతుంది. మౌలాలి సప్తగిరి కాలనీలో హర్షవర్ధన్ అనే బాలుడు మిస్సింగ్ అయ్యాడు. గురువారం మధ్యాహ్నం స్కూల్ నుండి ఇంటికి వచ్చిన బాలుడు కొద్దిసేపటికి ఇంటి నుండి బయటకు వెళ్లి, తిరిగి ఇంటికి రాకపోవడంతో బాలుడి తండ్రి శ్రీనివాస్ చౌదరి మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పిల్లాడు కిడ్నాప్ కు గురయ్యాడని సమాచారం అందుతుంది. పిల్లాడి తండ్రికి కేసు విత్ డ్రా చేసుకోవాలని బెదిరింపులు వస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తల్లితండ్రులుగానీ, పోలీసులు కానీ నిరాకరిస్తున్నారు. అయితే నాలుగు టీములుగా ఏర్పడిన పోలీసులు కిడ్నాప్ కోణంలో ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. మల్కాజిగిరి డీసీపీ జానకీ దరావత్, మల్కాజిగిరి ఎసీపీ నరేష్ రెడ్డి పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం .