- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యం
దిశ, అల్వాల్ : ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు పోతున్నామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం అల్వాల్ సర్కిల్ పరిధిలోని వెంకటాపురం, అల్వాల్ డివిజన్ల పరిధిలోని వివిధ ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పర్యటించి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాలాలు ఆక్రమించి ఇండ్లు నిర్మించడంతో వర్షాకాలంలో వదర ముంపు సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని ఎమ్మెల్యే గుర్తు చేశారు. నాలాలు ఆక్రమణతో వర్షపు నీరు రోడ్ల పైనుండి ప్రవహిస్తూ ఇండ్లలోకి చేరి లో తట్టు ప్రాంతాల ముంపునకు కారణం అవుతున్నాయని తెలిపారు.
చిన్నరాయుని చెరువు పరిసర ప్రాంతాలు చాలా కాలంగా సమస్యలకు నిలయంగా మారాయని, వాటికి శాశ్వత పరిష్కారం చూపేందుకు, ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ అధికారులు, స్థానిక కార్పొరేటర్లతో కలిసి ప్రత్యక్షంగా సమస్యలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించడం జరుగుతుందన్నారు. నాలాలు ఆక్రమించి ఇండ్లు, ప్రహారీలు నిర్మించడం మూలంగానే నీటి ప్రవాహం రోడ్ల మీదికి చేరుతుందని, దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు.
అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా చొరవ తీసుకుని అక్రమ కట్టడాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రజలు సైతం అధికారులకు సహకరించాలని కోరారు. ఈ ప్రాంతంలో బాక్స్ డ్రైయిన్ నిర్మించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబిత అనిల్ కిశోర్ గౌడ్,ఏఈలు లక్ష్మీ, అరుణ్, ఇరిగేషన్ ఏఈ పృథ్వి, నాయకులు అనిల్ కిశోర్ గౌడ్, శరణ్ గిరి, మల్లేష్ గౌడ్, సయ్యద్ మోసిన్, అనిల్, ప్రేమ్ కుమార్, కాలనీవాసులు సతీష్, రాకేష్, నాగప్ప, విశాల్, దేవ్ ప్రసాద్, కృష్ణమాచారి, సత్యనారాయణ, నవీన్ దేవ్, కుమార్, నరసమ్మ, నందిని పాల్గొన్నారు.