అల్వాల్‌లో ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న మైనంపల్లి

by Aamani |   ( Updated:2023-10-09 09:46:19.0  )
అల్వాల్‌లో ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న మైనంపల్లి
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: అల్వాల్ లో ఉద్రిక్తత నెలకొంది. మల్కాజిగిరి నియోజకవర్గం లో మారుతున్న అభ్యర్థుల సమీకరణలలో భాగంగా మైనంపల్లి హనుమంతరావు వర్గంపై పోలీసుల దాడులు పెరుగుతున్నాయని ఆరోపిస్తూ మైనంపల్లి స్వయంగా అల్వాల్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. స్టేషన్ లో మైనంపల్లి వస్తున్న విషయం తెలిసిన సీఐ సమావేశం పేరుతో తప్పించుకోవడంతో కార్యకర్తలను కోసం పోలీసు సిబ్బంది పై మైనంపల్లి తీవ్రంగా హెచ్చరికలు జారీ చేశారు. అల్వాల్ సీఐగా ఆనంద్ కిషోర్ పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మైనంపల్లి అనుచరులపై అనవసర కేసులు, బెదిరింపులు జరుగుతున్నాయని రాక్ గార్డెన్ లో సైతం కూల్చివేతలకు పాల్పడిన వారిపై కాకుండా అడ్డుకున్న వారిపై కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఆ కేసులలో సైతం స్పాట్లో లేని వారి పేర్లను పెట్టారని ఆరోపించారు.

Advertisement

Next Story