భారీ దోపిడీకి చెక్ పెట్టిన ఎస్ఓటీ పోలీసులు

by Kalyani |
భారీ దోపిడీకి చెక్ పెట్టిన ఎస్ఓటీ పోలీసులు
X

దిశ, మేడ్చల్ బ్యూరో: రియల్ వ్యాపారి వద్ద భారీగా డబ్బు ఉన్నట్లు గుర్తించారు. పలుమార్లు రెక్కీ నిర్వహించి దోపిడీకి పక్కా ప్లాన్ చేశారు. విషయాన్ని పసిగట్టిన ఎస్ఓటీ పోలీసులు, శామీర్పేట పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి దుండగులు చేపట్టబోయే దోపిడీ యత్నానికి చెక్ పెట్టారు. మేడ్చల్ జిల్లా శామీర్పేట పోతాయిపల్లి గ్రామంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సురభి రావు వద్ద భారీగా నగదు ఉన్నట్లు గుర్తించిన ఆయన నివాసం వద్ద మాటు వేసి దోపిడీకి దాదాపుగా సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని పసిగట్టిన ఎస్ఓటీ పోలీసులు శామీర్పేట్ పోలీసుల సహకారంతో పక్కాగా ప్లాన్ చేసి దుండగులను అదుపులోకి తీసుకున్నారు.

దోపిడీకి ప్లాన్ చేసిన చింతల రామ్ రెడ్డి (సూర్య నగర్ కాలనీ ఓల్డ్ ఆల్వాల్), సలీం (నర్సపూర్, మంచిర్యాల, ఆదిలాబాద్), భూమయ్య (నర్సాపూర్ విలేజ్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్, సిద్దిపేట), శ్రీనివాస్ (బచ్చన్నపేట జనగామ జిల్లా) లుగా పోలీసులు గుర్తించి వారిని విచారిస్తున్నట్లుగా సమాచారం. కాగా ఈ గతంలో మరో 10 మంది వరకు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. దోపిడీకి వచ్చిన ముఠా కర్ణాటక రాష్ట్రానికి వచ్చినట్లు భావిస్తున్నారు. నిందితుల వద్ద నుంచి మూడు ద్విచక్ర వాహనాలను ఒక కారుతో పాటుగా కత్తులు కటారులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కాగా ఈ ముఠా బడా బడా రియల్ వ్యాపారుల పై, సినీ నిర్మాతల పై దాడులు చేసి దోపిడీలు ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed