యువత సాంకేతిక రంగంలో రాణించాలి : కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి..

by Sumithra |
యువత సాంకేతిక రంగంలో రాణించాలి : కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి..
X

దిశ, కుత్బుల్లాపూర్ : యువత సాంకేతిక రంగంలో రాణించి సమాజంలో ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర కార్మిక శాఖమంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం కొంపల్లి మినర్వా గ్రాండ్ లో బీస్ సాప్ట్ వేర్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉన్నత విద్యాసంస్థ సెమినార్ లో పాల్గొన్నారు. మెరుగైన భద్రత ఆధునిక ఫీచర్ల ఆటోమైజేషన్ ను మెరుగుపర్చేందుకు తీసుకొచ్చిన క్లౌడిల్యా ఈఆర్పీ సాప్ట్ వేర్ ను సంస్థ అధినేత బీనా, డైరెక్టర్ మిధున్ రాజుతో పాటు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజవర్గ ఇంచార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రిమల్లారెడ్డి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక రంగంలో నూతన మార్పులు వస్తున్నాయన్నారు. దానికి అనుగుణంగా యువత కొత్త ఆవిష్కరణలు చేయడం అభినందనీయమన్నారు. నూతన సాప్ట్ వేర్ ద్వారా విద్యాసంస్థలో ఖచ్చితమైన సమాచారం అందించేందుకు, పరీక్షలనిర్వహణ, రోజువారి విద్యార్థుల పాఠ్యాంశాలు, ఇతర సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. లాభాపేక్షతో కాకుండా సామాజిక బాధ్యతతో ప్రతి సాప్ట్ వేర్ ను అందుబాటులో తీసుకురావాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల చైర్మన్లు, ప్రిన్సిపాల్స్, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed