- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
M K Stalin : తమిళనాడులో మళ్లీ హిందీ భాషా వివాదం.. ఎల్ఐసీపై సీఎం స్టాలిన్ ట్వీట్ వైరల్
దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు రాష్ట్రంలో మళ్లీ హిందీ (Hindi) భాష వివాదాన్ని రేపింది. హిందీలో ఎల్ఐసీ వెబ్‌సైట్ తేవడంపై (Tamil Nadu) తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ (M K Stalin) ఆగ్రహం వ్యక్తం చేశారు. వెబ్‌సైట్‌లో ఇంగ్లీష్ భాషను ఎంచుకునేందుకు కూడా ఆప్షన్ హిందీలో ఉండటంపై సీఎం స్టాలిన్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు.
భారతీయులందరి ప్రోత్సాహంతోనే ఎల్‌ఐసీ సంస్థ అభివృద్ధి చెందిందని తెలిపారు. అలాంటి వెబ్‌సైట్‌లో ప్రాంతీయ భాషల్ని తొలగించడం అన్యాయమన్నారు. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ భాషా దౌర్జన్యాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందీ ఇంపోజిషన్ ఆపండి (#StopHindiImposition) అంటూ హ్యాష్ ట్యాగ్ పెడుతూ ఎల్ఐసీ (LIC) వెబ్‌సైట్ ఫోటోను పెట్టారు. ఇందుకు సంబంధించిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, గతంలోనూ తమిళనాట హిందీ వివాదం అనేక సార్లు జరిగింది.