Harish Rao : నలిమెల భాస్కర్ కు కాళోజి సాహితి పురస్కారం ఇవ్వకపోవడం శోచనీయం : హరీష్ రావు

by Y. Venkata Narasimha Reddy |
Harish Rao : నలిమెల భాస్కర్ కు కాళోజి సాహితి పురస్కారం ఇవ్వకపోవడం శోచనీయం : హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ ఏడాది సెప్టెంబర్ 9 కాళోజి జయంతి సందర్భంగా, ప్రఖ్యాత సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత నలిమెల భాస్కర్‌(Nalimela Bhaskar)కు కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం(Kaloji Literary Award)ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకూ ప్రదానం చేయకపోవడం శోచనీయమని మాజీ మంత్రి టి.హరీశ్ రావు(Harish Rao) తప్పుబట్టారు. దీనిపై ట్విటర్ వేదికగా ప్రభుత్వ వైఖరిని విమర్శించారు. కాళోజి జయంతి నాడు సాహితీవేత్తలకు పురస్కారమిచ్చి, గౌరవించుకునే ఆనవాయితీని దురుద్దేశంతో విస్మరించడం దుర్మార్గమన్నారు.

ఇది ఒక్క భాస్కర్ కు మాత్రమే జరిగిన అవమానం కాదని, తెలంగాణ కవులందరికీ జరిగిన అవమానమని పేర్కొన్నారు. ఈరోజు కాళోజి కళాక్షేత్రం ప్రారంభం చేస్తున్న సందర్భంగా ఆయినా భాస్కర్ కు అవార్డు ప్రదానం చేయండని, చేసిన తప్పును సరి చేసుకోండని ప్రభుత్వానికి సూచించారు.

Advertisement

Next Story

Most Viewed