Mahesh Babu: అలాంటి వ్యక్తి అసలైన పురుషుడు.. మెన్స్ డే నాడు మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Hamsa |   ( Updated:2024-11-23 12:58:56.0  )
Mahesh Babu: అలాంటి వ్యక్తి అసలైన పురుషుడు.. మెన్స్ డే నాడు మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు(Mahesh Babu) ఇటీవల ‘గుంటూరు కారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయింది. ప్రజెంట్ దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో ‘SSMB29’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రజెంట్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి. ‘SSMB29’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రాజమౌళి కూడా ఇటీవల ఓ పోస్ట్ ద్వారా క్లారిటీ ఇవ్వడంతో అంచనాలు భారీగా పెరిగాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా, సూపర్ స్టార్ సోషల్ మీడియా ద్వారా ఆసక్తికర పోస్ట్ షేర్ చేశారు. నేడు పురుషుల దినోత్సవం సందర్భంగా ఓ సామాజిక కార్యక్రమంలో భాగం అయినట్లు ప్రకటించారు. మహిళలపై అత్యాచారాలు, వివక్షకు వ్యతిరేకంగా నిలవడం, లింగ సమానత్వం కోసం ఏర్పాటుచేసిన ‘మార్డ్’ లో చేరారు. ఇప్పటికే ఈ ప్రచారంలో ఫర్హాన్ అక్తర్(Farhan Akhtar), జావేద్ అక్తర్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar), యువరాజ్ సింగ్(Yuvraj Singh) ఉన్నారు.

మహేష్ బాబు వారి ఫొటోలను కూడా షేర్ చేస్తూ ‘‘గౌరవం, సానుభూతి మనిషికి ఉండాల్సిన నిజమైన లక్షణాలు. సమానత్వం కోసం నిలబడండి. ప్రతి పనిలోనూ దయను చూసేవాడు అసలైన పురుషుడు. ఈ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం నాడు నాతో పాటు మీరు ‘మార్డ్’లో చేరండి’’ అని రాసుకొచ్చారు. ప్రజెంట్ మహేష్ బాబు పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed