చెడు వ్యసనాలకు బాని సై చోరీలు.. నిందితుడి అరెస్టు..

by Sumithra |
చెడు వ్యసనాలకు బాని సై చోరీలు.. నిందితుడి అరెస్టు..
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : చెడు వ్యసనాలకు బాని సై దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను త్రీ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ విద్యసాగర్ తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా తాడే పల్లి గూడెంకు చెందిన గుర్రం అఖిల్ వ్యసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఈ నెల 29న పొన్నాల గ్రామం వై జంక్షన్ వద్ద గల మద్యం దుకాణంలో రూ.30 వేల నగదు, 2 మెన్షన్ హౌస్ ఫుల్ బాటిల్స్ దొంగతనం జరిగిందన్న ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అనుమానాస్పదంగా పొన్నాల వై జంక్షన్ వద్ద నిలుచొని హైదరాబాద్ వెళ్లేందుకు గుర్రం అఖిల్ వేచి చూస్తున్న క్రమంలో పోలీసులు పట్టు కొన్నారు. విచారించగా వైన్స్ లో దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. గుర్రం అఖిల్ వద్ద రూ. 30 వేల నగదు, మద్యం సీసా, రించ్, తాడును స్వాధీన పరచుకుని, అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు. గుర్రం అఖిల్ పలు దొంగతనాల కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడు. షాపుల, గృహాల యజమానులు సీసీ కెమెరాలను తప్పని సరిగా ఏర్పాటు చేసుకోవాలని సీఐ విద్యాసాగర్ తెలిపారు.

Next Story

Most Viewed