- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పార్టీలు కాదు.. వ్యవస్థలు శాశ్వతం
దిశ, కీసర : పార్టీలు కాదు.. వ్యవస్థలు శాశ్వతమని, ఎందరో నాయకులు వస్తారు.. పోతారు, పదవులు మారినా వ్యవస్థలు మారవని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. శనివారం నాగారం పురపాలక సంఘం కార్యాలయంలో చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సమావేశంలో 20 వార్డులలో రూ. 7 కోట్ల 8 లక్షలతో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వివిధ పనులకు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు మనపై నమ్మకంతో గెలిపించారని, వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయకూడదని అన్నారు.
నమ్మకాన్ని నిలబెట్టుకొని సమస్యలను పరిష్కరిస్తే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతామని అన్నారు. పార్టీలకతీతంగా మున్సిపాలిటీని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచేందుకు ప్రతి ఒక్కరూ మున్సిపల్ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. మున్సిపల్ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు. నాగారం మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తున్న కౌన్సిలర్లకి ఎంపీ ఈటల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ ఎస్. భాస్కర్ రెడ్డి, వార్డ్ కౌన్సిలర్లు, మేనేజర్ కె. చంద్రశేఖర్, విద్యుత్ శాఖ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.