- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రభుత్వ స్థలం... పారా హుషార్..
దిశ, కుత్బుల్లాపూర్ : బాచుపల్లి మండలంలో ప్రభుత్వ స్థలాలు ఫలహారం అవుతున్నాయి. అవినీతి మత్తులో, విధుల అలసత్వంతో సర్కారు జాగలను భూ బకాసురులకు అప్పనంగా బాచుపల్లి రెవెన్యూ అధికారులు అప్పగిస్తున్నారు. తాజాగా నిజాంపేట్ లో కబ్జా మొహానుడి కబ్జా తంతు హద్దులు దాటుతుంది. చట్టంతో నాకేంటి.. ఎవడైతే చేసేదేంటి.. డోంట్ కేర్ అంటూ రెచ్చి పోతూ ప్రభుత్వ స్థలాన్ని కబలిస్తున్నాడు. ప్రధాన రోడ్డు పై ఆ ప్రభుత్వ స్థలం ఉండడం... లక్షలలో గజం విలువ పలుకుతుండడంతో కబ్జా మొహానుడి వ్యామోహం హద్దులు దాటుతుంది.
నిజాంపేట్ పాలకులు సైతం తనకు చుట్టపు వరుస కావడంతో నాకు అడ్డు చెప్పే వాడెవ్వడు అంటూ కోట్ల స్థలం కొల్లగొట్టేందుకు పక్కా స్కెచ్తో ముందుకు సాగుతున్నాడు. గత ఆరు నెలల కిందటే ఆ కబ్జాను దిశ కథనంతో వెలుగులోకి తీసుకురాగా రెవెన్యూ అధికారులు కూల్చివేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కానీ నేడు అట్టి స్థలం పై మళ్ళీ పంజా విసురుతున్నాడు. తాజాగా మళ్ళీ కబ్జా చేస్తూ 400 చదరపు గజాల స్థలం కాజేసేందుకు 59 జీఓ పేరుతో కుట్రలు చేస్తున్నాడు.
కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలం.. హుష్కాకీ..
నిజాంపేట్ నుండి బాచుపల్లి వెళ్లే ప్రధాన రహదారిలో పెట్రోల్ బంక్ ఆనుకొని ఉన్న నిజాంపేట్ సర్వేనెంబర్ 332లో ఉన్న సుమారు 400 చదరపు గజాల ప్రభుత్వ స్థలం మాయం కాబోతుంది. ఇక్కడి ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారం ఆ స్థలం విలువ రూ.5 కోట్లు పలుకుతుంది. స్థానిక పాలకులు, రెవెన్యూ అధికారులకు మ్యామ్యాలు ఇచ్చుకుంటూ తన కబ్జా పంతం నెగ్గించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. కబ్జా స్థలాన్ని విడిపించి పదే పదే కబ్జా చేస్తున్న కబ్జా మొహానుడిపై కేసు నమోదు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.