AP : ఏపీలో విద్యుత్తు చార్జీల పెంపుపై కమ్యూనిస్టుల నిరసన

by Y. Venkata Narasimha Reddy |
AP : ఏపీలో విద్యుత్తు చార్జీల పెంపుపై కమ్యూనిస్టుల నిరసన
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP) పెంచిన విద్యుత్ ఛార్జీల(Electricity charges)ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ (CPI) నిరసన చేపట్టింది. ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చిందని, అందుకు విరుద్దంగా చార్జీలు పెంచిందని, ప్రజలపై రూ. 6,072 కోట్ల భారం వేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఇది చాలదన్నట్లుగా మరో రూ. 11,820కోట్ల భారాన్ని పెంచాలని ఈఆర్సీని అడిగారని రామకృష్ణ ఆరోపించారు.

అసెంబ్లీలో మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టమని ప్రభుత్వం చెప్పడం చూస్తే ఇండ్లకు, కుటుంబ, చిన్న తరహ పరిశ్రమలకు స్మార్ట్ మీటర్లు పెట్టే విధంగా ప్రభుత్వం మాటలు ఉన్నయన్నారు. ప్రధాని మోడీ ఆదానీకి లొంగి దేశాన్ని దోచుపెడుతుంటే, గతంలో జగన్, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మోడీ, ఆదానీలకు అనుకూలంగా ప్రజలపై భారం వేశారన్నారు. చార్జీలను పెంపును ఉపసంహరించుకోవాలని రేపటి నుంచి అన్ని జిల్లాల్లో సభలు, సమావేశాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేస్తామని, డిసెంబర్ లో ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

Next Story