- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రెండేళ్లు పదవిలో ఉండి ఏమి చేశావ్ ?
దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి : బోర్డ్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ పదవిలో కంటోన్మెంట్ ప్రజలకు చేసింది ఏమి లేదని, అబద్దాల కోరు రామకృష్ణ అని, నోరు అదుపులో పెట్టుకో అని, నీ మాటలను ప్రజలు నమ్మేస్థితిలో లేరని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి అన్నారు. రామకృష్ణ ఒక చేతకాని దద్దమ్మ అని, మూడు సంవత్సరాలు ఉపాధ్యక్షుని హోదాలో ఉండి రెండు సంవత్సరాలు నామినేటేడ్ సభ్యుడు హోదాలో ఉన్న ప్రజాసమస్యలను ఎన్నడు పట్టించుకున్న పాపాన పొలేదన్నారు. మోదీ సభలకు టెంట్లువేసుకుంటూ, వ్యాపారం చేసుకుంటున్నాడని అన్నారు. టెంట్లు వేయటం అయిపోగానే ప్రజా సమస్యలు గుర్తు వస్తున్నాయా ? అని ఎద్దేవా చేశారు. మేము చేస్తున్న పనులను తాను చేసానని చెప్పుకోవటం ఆలవాటుగా మారిందని అన్నారు. బీఆర్ఎస్ నేతల వల్లనే రహదారులు తెరుచుకున్నాయి.
అందులో ఎలాంటి సందేహం లేదని తెరిచినరోడ్లను ఎలాంటి అంక్షలు విధించకుండా రహదారుల తెరిచి ఉంచారా ? లేదా ? మేము పర్యవేక్షించటం తప్పా? అని ప్రశ్నించారు. ఉచిత మంచినీటి పథకం అమలుకు ఎమ్మెల్యే సాయన్నతో పాటు మంత్రులు తలసాని, మల్లారెడ్డి, మర్రిరాజశేఖర్ రెడ్డిల కృషి ఉందని అన్నారు. గతంలో ఎప్పుడు జరగని విధంగా అందరి సహకారంతో కంటోన్మెంట్ ప్రాంతంలో అత్మీయ సమ్మేళనాలు జరిగాయని, అది ఓర్వలేక బీఆర్ఎస్ గ్రూప్ లు. ఉన్నాయని అబద్దపు ప్రచారం చేస్తున్నావు.. నోరు అదుపులో పెట్టుకో అని మండిపడ్డారు. మీ కారణంగా కంటోన్మెంట్ లోని బీజేపీ నాయకులు ఇరకాటంలో పడ్డారని సీనియర్లకు అవకాశం ఇవ్వకుండా మీరు నియంతపాలన చేస్తున్నారని, రాబోయే రోజుల్లో మీ వల్ల బీజేపీ పార్టీ కంటోన్మెంట్ లో విచ్చిన్నం అవడం ఖాయం అని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న 58, 59 జీఓ క్రింద ఒక్కపేదవాడికి పట్టాను ఇప్పించగలిగావా ? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్లు ఇవ్వటం కాదు దమ్ము ధైర్యం ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 700 కోట్లు సర్వీస్ చార్జీ బకాయిలను తీసుకువచ్చి కంటోన్మెంట్ అభివృద్ధి కృషి చేయి అని సవాల్ విసిరారు. సాయన్నని గురువు అని చెప్పుకునే నీవు ఆయనను ఎన్నివిధాలుగా బూతులు తిట్టావు నీకు గుర్తులేదా ? రామకృష్ణ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా నీ స్వార్ధ రాజకీయాలు మానుకుని, ప్రజాసమస్యల పైన పోరాడు మేము కూడా నీకు సహకరిస్తాము. అంతేకాని పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడితే ఇకనుండి ఊరుకునేది లేదు అని ఘాటుగా అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ బోర్డు సభ్యలు పాండు యాదవ్, నళిని కిరణ్, భాగ్యశ్రీ , లోకనాథంలు పలువురు ఉన్నారు.