- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఫ్లాష్...ఫ్లాష్...శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థి ఆత్మహత్య
దిశ, మేడిపల్లి : మార్కులు తక్కువ వచ్చాయని ఉపాధ్యాయుడు హేళన చేయడంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం పీర్జాదిగూడ శ్రీ చైతన్య కాలేజీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన రమాదేవి అనే విద్యార్థిని పీర్జాదిగూడ శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ చదువుతుంది. మార్కులు తక్కువ వచ్చయని ఉపాధ్యాయుడు అందరి ముందు హేళన చేయగా అవమానంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలిసిన విద్యార్థి సంఘాల నాయకులు కాలేజీ ముందు ఆందోళనకు దిగారు. దాంతో పోలీసులకు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం విద్యార్థి సంఘాలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. కొందరు నాయకులను విచక్షణా రహితంగా చితక బాదారు. విషయం తెలిసి అక్కడికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులను కూడా లోపలికి రానివ్వకపోవడంతో వారు గేటు ముందు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే తన పిల్లలని చూపించాలని, వారితో మాట్లాడించాలని యాజమాన్యాన్ని కోరుతున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.