- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
INC: అందరికీ ఒకే రకమైన విద్య అందాలి.. ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి
దిశ, వెబ్ డెస్క్: పట్టణ, గ్రామీణ విద్యార్థులకు(Urban And Rural Students) ఒకే రకమైన విద్యా బోధన(Same Kind Of Education) అందాలని, ఈ విషయాన్ని సీఎం(CM Revanth Reddy) దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్(State Planning Commission Vice Chairman) డాక్టర్ జీ చిన్నారెడ్డి(Dr. G. Chinna Reddy) అన్నారు. ప్రజా భవన్(Praja Bhavan) లో పిల్లలు -ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సమకాలిన అంశాలతో పాటు పాఠ్యాంశాలపై డిజిటల్ ఆన్లైన్ తరగతులు నిరంతరంగా నిర్వహించాల్సిన అవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు.
అలాగే పట్టణాలు, నగరాల్లో నివాసం ఉండే విద్యార్థులకు నూతన పద్ధతుల్లో విద్యాభ్యాస అవకాశాలు ఉంటాయని కానీ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇలాంటి వసతులు ఉండవని తెలిపారు. అందుకోసం పట్టణ, నగర, గ్రామీణ విద్యార్థులందరికీ ఒకే విధమైన విద్యా బోధన అందాల్సిన ఆవశ్యకత ఉందని ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్తానని స్పష్టం చేశారు. అంతేగాక విద్యారంగాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని, విద్యారంగంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టిని సారించారని, ఇందులో భాగంగా ఈ 25 ఎకరాల స్థలంలో సమీకృత విద్యాలయాల నిర్మాణాలను చేపట్టారని వివరించారు. ఇక బాల్యం చాలా గొప్ప దని, బాల్య దశలోనే వారి భవిష్యత్తు జీవితాన్ని తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులు తీసుకోవాలని సూచించారు.