- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కుల గణన సర్వేతో సమాజంలో మార్పు : ఎమ్మెల్యే
దిశ, తాండూరు : కుల గణన సర్వేతో సమాజంలో మార్పుతో పాటు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణం శాంతినగర్ లోని తన నివాసంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మున్సిపల్ అధికారులకు సర్వే వివరాలను తెలియజేశారు. సర్వేలో కుటుంబ సభ్యుల వివరాలతో పాటు, ఆస్తులు, ఇతర వివరాలు నమోదు చేయించుకున్నారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..సంక్షేమ ఫలాలతోపాటు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యా, ఉద్యోగ తదితర అంశాల్లో వాటా లభిస్తుందని వివరించారు. రాహుల్‌గాంధీ ఆలోచనల మేరకు సమగ్ర కుల గణన ద్వారా ఇంటింటి సర్వే చేపడుతున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రాన్నిఅన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డైనమిక్ నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. అవి ప్రతిపక్షాలకు కంటగింపు కాకపోవడంతో విమర్శిస్తున్నారని వివరించారు. కులగణన బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వివరాలు తెలుస్తాయని ఈ సర్వే చేపట్టడం తెలంగాణ ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. ఇప్పటికే కొన్ని గ్యారెంటీలను అమలు చేస్తున్నామని, ఈ సర్వే ఫలితాలతో మిగిలిన గ్యారెంటీలను పకడ్బందీగా అమలు చేయడానికి ఉపయోగపడుతుందని వివరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్, సిబ్బంది ఉన్నారు.