- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Lionel Messi : వచ్చే ఏడాది కేరళకు రానున్న ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ
by Sathputhe Rajesh |
X
దిశ, స్పోర్ట్స్ : ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ వచ్చే ఏడాది కేరళకు రానున్నారు. కేరళలో జరిగే అంతర్జాతీయ ఫుట్ బాల్ మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టుతో పాటు ఆయన పాల్గొనున్నారు. ఈ విషయాన్ని కేరళ సీఎం పినరయి విజయన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్ బుక్ ద్వారా అనౌన్స్ చేశారు. ‘విభిన్న దేశాలు, సంస్కృతుల హద్దులు దాటి కేరళలో ఫుట్‌బాల్‌ను అమితంగా ఇష్టపడతారు. వచ్చే ఏడాది ఫుట్ బాల్ వరల్డ్ చాంపియన్ అర్జెంటీనా జట్టు కేరళకు రానుంది. దిగ్గజ ఆటగాడు లియెనెల్ మెస్సీ సైతం రాష్ట్రానికి రానున్నారు.’ అని విజయన్ తెలిపారు. 2011లో కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో వెనిజులాతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో ఆడేందుకు మెస్సీ భారత్‌కు చివరి సారిగా వచ్చారు.
Advertisement
Next Story