రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు.. ఉపాధ్యాయురాలి మెడలో నుంచి గోల్డ్ చైన్ స్నాచింగ్

by Jakkula Mamatha |
రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు.. ఉపాధ్యాయురాలి మెడలో నుంచి గోల్డ్ చైన్ స్నాచింగ్
X

దిశ,ఎమ్మిగనూరు: ఆదోని నియోజకవర్గం పరిధిలోని ఆరేకల్లు పరిధిలో ఉన్న ఎస్సీ గురుకుల అంబేద్కర్ పాఠశాలకు సంబంధించిన పార్వతి అనే ఉపాధ్యాయురాలు (సోమవారం 18వ) సాయంత్రం విధులు నిర్వర్తించుకొని సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో సొంత ప్రాంతానికి బయలుదేరుతుండగా, ఎస్సీ మరియు బీసీ గురుకులాలకు మధ్య చెట్ల పొదల చాటున కాపు కాసిన దుండగులు పార్వతి అనే మహిళకు సంబంధించిన మూడు తులాల బంగారం తాళి పుస్తెల గొలుసు పై కన్నేశారు. ఈ క్రమంలో కాపు కాసిన దుండగులు పల్సర్ ద్విచక్ర వాహనంపై ముసుగులో వచ్చిన సంబంధిత బాధితురాలు పార్వతి మెడలో ఉన్న గొలుసును అపహరించే ప్రయత్నంలో, సగం బంగారు గొలుసును దుండగులు ఎత్తుకొని పోగా, దుండగులతో పోరాడి గాయపడి, సగం దక్కించుకుంది, వెంటనే పాఠశాల ప్రిన్సిపాల్ పద్మ ఆదోని తాలూకా సి ఐ మరియు ఎస్ఐ లకు ఫిర్యాదు చేయగా సంఘటన జరిగిన స్థలానికి చేరుకునే చేరుకుని, వెంటనే స్పందించి సంఘటన స్థలాన్ని పరిశీలించి నిందితులు ఎవరనేదానిపై స్పందించి, వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటన పై పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed