CBSE : సీబీఎస్‌ఈ బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

by Hajipasha |
CBSE : సీబీఎస్‌ఈ బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
X

దిశ, నేషనల్ బ్యూరో : వచ్చే సంవత్సరం జరగనున్న పదోతరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) బుధవారం విడుదల చేసింది. పదోతరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 18 వరకు, 12వ తరగతి వారికి ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 4 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. పూర్తి టైమ్ టేబుల్‌ను విద్యార్థులు సీబీఎస్‌ఈ అధికారిక పోర్టల్‌లో చూడొచ్చు. పదోతరగతి విద్యార్థులకు మొదటి పరీక్ష ఇంగ్లిష్. 12వ తరగతి వారికి మొదటి పరీక్ష ఫిజికల్ ఎడ్యుకేషన్.

ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో కోడ్‌ను కేటాయించారు. బోర్డు పరీక్షలకు(CBSE board exams) సంబంధించిన గరిష్ఠ మార్కులు, ప్రాక్టికల్స్ సమాచారం, ప్రాజెక్టు వర్క్, అంతర్గత మదింపు, ఆన్సర్ బుక్ లెట్ నమూనా వంటి సమాచారాన్ని సీబీఎస్ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు. ‘సీబీఎస్‌ఈఅకడమిక్.ఎన్‌ఐసీ.ఇన్’ అనే మరో పోర్టల్‌‌లోకి వెళ్లి ప్రశ్నల నమూనాలు, మార్కుల కేటాయింపు, పరీక్షా పద్ధతి వంటి వివరాలన్నీ విద్యార్థులు చూడొచ్చని సీబీఎస్‌ఈ వెల్లడించింది.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed