Bhatti: నిధుల ఖర్చుపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలి.. అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు

by Ramesh Goud |   ( Updated:2024-11-20 15:09:23.0  )
Bhatti: నిధుల ఖర్చుపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలి.. అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్సీ(SC), ఎస్టీ(ST) అభివృద్ధి(Development) నిధుల ఖర్చు పై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం(Deputy CM) మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి నిధులపై 32 శాఖల పనితీరుపై సుదీర్ఘంగా సమీక్ష సమావేశం(Review Meeting) నిర్వహించారు. శాఖల వారీగా కేటాయించిన నిధులు, చేసిన ఖర్చు, గత ఎడాది ఖర్చు చేయకుండా మిగిలిపోయిన నిధులు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ , ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం(SC ST Sub Plan Act) ప్రకారం అన్ని శాఖల్లో ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలని... అమలుకు సపోర్ట్ యూనిట్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అన్ని శాఖల్లో సబ్ ప్లాన్ చట్టం ప్రకారం నిధులు ఖర్చు అవుతున్నది లేనిది ఇక నుంచి ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పర్యవేక్షిస్తారని డిప్యూటీ సీఎం తెలిపారు. సబ్ ప్లాన్ చట్టం అమలుపై సెస్ ఇప్పటి వరకు సమర్పించిన నివేదికలు అధ్యయనం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఆర్థిక శాఖలో ప్రత్యేకంగా రిసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రత్యేక పథకాల రూపకల్పన చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి నిధుల ఖర్చుపై అన్ని శాఖలు 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కోరారు. గిరిజన తండాలకు త్రీ ఫేస్ విద్యుత్ సరఫరా కావాలన్న డిమాండ్ ఉన్న నేపథ్యంలో అధికారులు ఆ మేరకు చర్యలు చేపట్టాలన్నారు. మరో మూడు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేసేందుకు అన్ని శాఖల అధికారులు మంచి పథకాలను సిద్ధం చేసుకుని ఆర్థిక శాఖకు నివేదిక సమర్పించాలన్నారు. ఇది ఇందిరమ్మ రాజ్యం, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం గత కాంగ్రెస్ ప్రభుత్వం(Previous Congress Govt) హయాంలోనే వచ్చిందని, ఈ పథకం అమలుపై ప్రజా ప్రభుత్వం స్పష్టంగా ఉందన్నారు. గత ప్రభుత్వ చర్యల మూలంగా పదేళ్లపాటు అర్హులైన వారు లబ్ధి పొందలేకపోయారని, ఆ వర్గాలకు చేయూతను ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్(Vikas Raj), ముఖ్య కార్యదర్శి ఫైనాన్స్ సందీప్ కుమార్ సుల్తానియా(Sandeep Kumar Sulthaniya), ఎస్టీ వెల్ఫేర్ సెక్రెటరీ శరత్(Sharath), ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్సీ వెల్ఫేర్ శ్రీధర్(Sridhar), ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జ(Rahul Bojja), సిడిఎమ్ఏ కమిషనర్ శ్రీదేవి(Sridevi), ఆర్టీసీ ఎండి సజ్జనార్(VC Sajjanar) తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేటు కళాశాల సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నాం

ప్రైవేటు డిగ్రీ, ఇంటర్ కళాశాలలకు సంబంధించిన వివిధ సమస్యల పట్ల ఈ ప్రభుత్వానికి అవగాహన ఉందని, దీనిపై సానుకూలంగా స్పందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం సచివాలయంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, ప్రైవేటు కళాశాలల యజమానుల సంఘం సభ్యులతో డిప్యూటీ సీఎం సమావేశం అయ్యారు. కళాశాలల సమస్యలు దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు.

Advertisement

Next Story