వీడెవడండీ బాబూ..లవర్ తో భార్య పెళ్లి చేసాడు!

by Veldandi saikiran |
వీడెవడండీ బాబూ..లవర్ తో భార్య పెళ్లి చేసాడు!
X

దిశ, వెబ్ డెస్క్ : భార్య ( Wife ) కోసం ఓ భర్త ( Husband ) భారీ త్యాగమే చేశాడు. ఆమె కోరుకున్న వ్యక్తితో.. పెళ్లి చేసి... సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు త్యాగశీలి భర్త. భార్య కోరుకుంటున్న ప్రియుడితో... దగ్గరుండి పెళ్లి చేశాడు ఆ భర్త. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ( Uttar Pradesh) చోటుచేసుకుంది. కాస్త ఆలస్యంగా వచ్చిన ఈ ఘటన సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంత్ కబీర్ నగర్ జిల్లాలో బబ్లూ ( Bablu) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. బబ్లూ అలాగే శ్రీత ఇద్దరికీ 10 సంవత్సరాల కిందటే వివాహం జరిగిందని సమాచారం. అయితే ఉద్యోగ రీత్యా... సొంత జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు బబ్లూ వెళ్లాల్సి వచ్చింది. దీంతో తన భార్యను ఇంటివద్దె ఉంచి ఉద్యోగం కోసం బబ్లూ వెళ్ళాడు.

ఈ నేపథ్యంలోనే... ఒంటరిగా ఉంటున్న బబ్లూ భార్య... అదే గ్రామంలో ఉన్న మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. వికాస్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకున్న బబ్లూ భార్య.... ఆ తర్వాత, వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే ఈ విషయం తెలిసిన బబ్లూ.. తన భార్యపై సీరియస్ కాకుండా.. ఆమెను అర్థం చేసుకున్నాడు. తన భార్యతో పాటు వికాస్ కు.. గ్రామ సమక్షంలోనే పెళ్లి కూడా చేశాడు బబ్లూ. అలాగే తన ఇద్దరు పిల్లల బాధ్యతను కూడా తానే తీసుకున్నాడు. ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Next Story

Most Viewed