- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
టెన్త్ పరీక్ష విధుల్లో నిర్లక్ష్యం.. ముగ్గురు టీచర్లపై సస్పెన్షన్ వేటు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదోతరగరి పరిక్షలు (Tenth exams) ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో అధికారులు, ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాగా ఇలాంటి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ యాక్షన్ (Government serious action) తీసుకుంటుంది. ఇంటర్ పరీక్షల్లో నెలకొన్న సమస్యలు అధికారులు నిర్లక్ష్యంపై వ్యవహరించిన మాదిరిగానే పదో తరగతి పరీక్షల సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా జుక్కల్ జిల్లా పరిషత్ పాఠశాల (Jukkal Zilla Parishad School)లో టెన్త్ పరీక్షల సమయంలో నిర్లక్ష్యంగా ఉన్న ముగ్గురు ఉపాధ్యాయులకు అధికారులు షాక్ ఇచ్చారు.
విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ముగ్గురిపై సస్పెన్షన్ వేటు (Three teachers suspended) వేశారు. ఎగ్జామ్ సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ సునీల్, డిపార్ట్మెంట్ ఆఫీసర్ భీం, ఇన్విజిలేటర్ దీపికను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కాగా పరీక్ష సమయంలో టెన్త్ పరీక్షా కేంద్రం నుండి కొన్ని ప్రశ్నలు బయటకు లీక్ అయ్యాయని, ఆ ప్రశ్నలను కాగితంపై రాసి బయటకు పంపారని సదరు ఉపాద్యాయులపై ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు నిన్న జరిగిన ఘటన.. బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకు ముందు వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు.
Read More..