100 కాదు టీటీడీ గోశాలలో 191 గోవులు మరణించినట్లు ప్రకటన!

by Veldandi saikiran |   ( Updated:2025-04-17 11:06:49.0  )
100 కాదు టీటీడీ గోశాలలో 191 గోవులు మరణించినట్లు ప్రకటన!
X

దిశ, వెబ్ డెస్క్ : టీటీడీ గోశాలలో ఆవుల మృతిపై టీడీపీ, వైసీపీ రాజకీయం కొనసాగుతోంది. ఈ తరుణంలోనే మృతి చెందిన గోవుల జాబితా విడుదల చేశారు గోశాల మేనేజర్. ఈ ఏడాదిలో 191 గోవులు మరణించినట్లు ప్రకటన చేశారు. ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 వరకు 191 ఆవులు మృతి చెందినట్లు పేర్కొన్నారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో మొత్తం 45 ఆవులు చనిపోయినట్లు స్పష్టం చేశారు.

ఇక సెప్టెంబర్ 2024 లో 21 ఆవులు మరణించినట్లు నిర్ధారణ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న ఏప్రిల్ లో 17, మేలో 18 ఆవులు మృతి చెందినట్లు తెలిపారు. మూడు నెలల్లో వందకు పైగా ఆవులు చనిపోయినట్లు భూమన ఆరోపించడంతో రాద్దాంతం మొదలైంది. 10 నెలల్లో 170 కి పైగా ఆవులు చనిపోయాయని ఇవాళ చెప్పుకొచ్చిన భూమన కరుణాకర్ రెడ్డి.. టీడీపీపై విమర్శలు చేశారు.

Next Story

Most Viewed