తేమ పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టొద్దు : కలెక్టర్

by Kalyani |
తేమ పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టొద్దు : కలెక్టర్
X

దిశ, రాయపర్తి : తేమ పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టవద్దని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారదా దేవి అన్నారు. బుధవారం మండలంలోని మైలారం శివారు ప్రాంతంలో ఉన్న భాగ్యలక్ష్మి అగ్రోటెక్ పత్తి కొనుగోలు కేంద్రాన్ని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారదా దేవి సందర్శించారు పత్తి మిల్లులోని స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు సిసిఐ ద్వారా ఎంత పత్తి కొనుగోలు చేశారని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… తేమ పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టవద్దన్నారు. రైతులు కూడా ప్రభుత్వం నిర్ణయించిన నియమ నిబంధనలకు లోబడి పత్తిని మిల్లులకు తీసుకురావాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరతో పాటు బోనస్ కూడా రైతులకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. యాసంగిలో రైతులు మేలైన వరి వంగడాలను ఎంచుకొని సేద్యం చేసుకోవాలన్నారు. రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు అన్నారు. ఆమె వెంట మార్కెటింగ్ అధికారి సురేఖ, జిల్లా వ్యవసాయ అధికారిని అనురాధ, సివిల్ సప్లై అధికారి సంధ్యారాణి, డి సి పి ఓ నీరజ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed