Maoist Leader: ఎంఏ చదివేందుకు మావోయిస్టు అగ్ర నేత ఆసక్తి.. ఒడిశా జైలులో ఉన్న సభ్యసాచి పాండా

by vinod kumar |
Maoist Leader: ఎంఏ చదివేందుకు మావోయిస్టు అగ్ర నేత ఆసక్తి.. ఒడిశా జైలులో ఉన్న సభ్యసాచి పాండా
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశా (Odisha)లోని బెర్హంపూర్ సర్కిల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మావోయిస్టు అగ్రనేత సభ్యసాచి పాండా (Sabya saachi panda) ఈ ఏడాది ఒడిశా స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ (OSOU)నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌ (Public administration)లో ఎంఏ చదివేందుకు ఆసక్తి చూపినట్ట జైలు సీనియర్ సూపరింటెండెంట్ డీఎన్ బారిక్ తెలిపారు. రెండేళ్ల క్రితం ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పాండా తాజాగా ఎంఏ కోర్సులో చేరేందుకు పత్రాలు సమర్పించిన ఆరుగురు ఖైదీలలో ఒకరని చెప్పారు. సభ్యసాచితో పాటు మొత్తం నలుగురు ఖైదీలు, ఇద్దరు అండర్ ట్రయల్ ఖైదీలు ఎంఏ చదవనున్నారు. వీరందరికీ అడ్మిషన్స్ ఓకే అయిన తర్వాత స్టడీ మెటీరియల్ అందించనున్నట్టు జైలు టీచర్ సనాతన్ ఖిల్లార్ చెప్పారు. కాగా, శరత్ అలియాస్ సునీల్, సబ్యసాచి ఒడిశాలో మావోయిస్టు పార్టీకి కీలక నేతగా ఉన్నారు. ఈ క్రమంలోనే 2014 జూలై 18న బెర్హంపూర్‌లో పోలీసులకు పట్టుబడ్డాడు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా వివిధ జిల్లాల్లో 130కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న సభ్యసాచికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు.

Advertisement

Next Story