BRS: రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం ఖరీదు విద్యార్థుల ప్రాణాలు.. మాజీ మంత్రి హరీష్ రావు

by Ramesh Goud |
BRS: రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం ఖరీదు విద్యార్థుల ప్రాణాలు.. మాజీ మంత్రి హరీష్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నిర్లక్ష్యం ఖరీదు 42 మంది విద్యార్థుల ప్రాణాలు అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు(Thanneru Harish Rao) మండిపడ్డారు. కాంగ్రెస్(Congress) 11నెలల కాలంలో 42 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, ఇప్పటికైనా కళ్ళు తెరవండి అని ఎన్నిసార్లు మొత్తుకున్నా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. నల్గొండ జిల్లా(Nalgonda District)లో పాము కాటుకు గురై మరో గురుకుల విద్యార్థి ఆసుపత్రి పాలైన వార్త తీవ్రంగా కలిచివేసిందన్నారు. కాంగ్రెస్ పాలనలో బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన పిల్లలు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రుల్లో చేరుతుండడం సిగ్గుచేటన్నారు. గురుకులాల్లో కుక్కకాట్లు, ఎలుక కాట్లు, పాము కాట్లు సాధారణంగా మారడం దురదృష్టకరం అన్నారు.

విద్యాశాఖ, ఎస్సీ(ST), ఎస్టీ(ST), మైనార్టీ(Minority) సంక్షేమ శాఖలు(Welfare Departments) తన వద్దనే ఉన్నా ముఖ్యమంత్రి ఏనాడు సమీక్ష(Review) చేయదని ఆరోపించారు. పురుగుల అన్నం తినలేక విద్యార్థులు ఆకలితో అలమటించినా పట్టించుకోడని, టీచర్లు కావాలంటూ విద్యార్థులు రోడ్డెక్కినా పట్టించుకోడం లేదని మండిపడ్డారు. ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినా పట్టించుకోవడం లేదని, పాముకాట్లు, కుక్క కాట్లు, ఎలుక కాట్లు, కరెంటు షాకులతో ఆసుపత్రుల పాలైనా పట్టించుకోడని దుయ్యబట్టారు. విద్యాశాఖ(Education Dept) ప్రక్షాళన అంటూ ప్రగల్భాలు పలకడం కాదు రేవంత్ రెడ్డి... గురుకులాల్లో(Gurukulas) కనీస సౌకర్యాలు కల్పించి, విద్యాబోధన జరిగేలా చూడాలని సూచించారు. అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలు కాపాడండి అని సీఎంకు హితవు పలికారు.

ప్రభుత్వ పాఠశాలల దుస్థితికి దారుణంగా ఉందని, ప్రభుత్వ పనితీరుకు మధ్యాహ్న భోజనం అధ్వాన్నమే నిదర్శనం అన్నారు. ఉడకని అన్నం, నీళ్ళ చారు, నాణ్యత లేని పప్పు.. వారానికి మూడు సార్లు ఇచ్చే గుడ్డు మాయం అన్నారు. ఏడాదిగా నిలిచిన గుడ్డు పంపిణీ.. బిల్లులు రాక నిర్వాహకులు అవస్థలు..11 నెలలుగా వేతనాల కోసం ఎదురు చూస్తున్న భోజన కార్మికులు ఇవన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు అన్నారు. పేద విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తుపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని స్పష్టం అవుతోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎలాగూ విద్యాశాఖను పట్టించుకోడు అని, కలెక్టర్లు(District Collectors) ప్రభుత్వ పాఠశాలలు(Govt Schools) సందర్శించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed