జీడికంటి రామయ్య కళ్యాణ వైభోగం

by Kalyani |
జీడికంటి రామయ్య  కళ్యాణ వైభోగం
X

దిశ, లింగాల ఘణపురం : కళ్యాణ వైభోగమే... సీతారాముల కళ్యాణమే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వీరాచల రామచంద్రస్వామి కళ్యాణం పునర్వసు నక్షత్ర యుక్త సమయాన లోక కళ్యాణార్థం జన సుభిక్షం కోసం జీడి కంటి పుణ్యక్షేత్రంలో దివి నుండి భువికి దిగివచ్చిన సీతారామచంద్ర స్వాముల కళ్యాణం పచ్చని పందిరిలో, భాజా బదంత్రీలతో వేదమంత్రోత్సవాలతో 31 మంది దంపతులు కూర్చుని బుధవారం స్వామివారి తిరుక్కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు. ప్రభుత్వం తరఫున స్వామివారి కల్యాణానికి ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించి స్వామివారి కల్యాణం లో పాల్గొన్నారు. భక్తుల రామనామ స్మరణతో పరవశించిపోయారు. కళ్యాణాన్ని తిలకించిన భక్తులు, స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. హైదరాబాద్, నల్లగొండ తదితర సుదూర ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారి కల్యానికి హాజరయ్యారు.

భక్తుల సౌకర్యం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్న ప్రసాదం సుమారు వెయ్యి మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కళ్యాణ మహోత్సవానికి అడిషనల్ కలెక్టర్ పింకేష్ కుమార్, ఆర్డీవో గోపిరామ్ పలువురు ప్రముఖులు హాజరయ్యారు.ఈ ఈ కార్యక్రమంలో ఈవోలు వంశీ, కొండబోయిన రాములు, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఏల నర్సింహులు ( మూర్తి), మార్కెట్ వైస్ చైర్మన్ కొల్లూరి శివకుమార్, మాజీ జెడ్పిటిసి గుడి వంశీధర్ రెడ్డి,ఆలయ ధర్మకర్తలు మొటికే శ్రీశైలం, నర్ర షార్బారెడ్డి, ఉడుగుల వెంకన్న, కత్తుల శ్రీనివాస్ రెడ్డి, మంద శ్రీధర్ రెడ్డి, కడకంచి లక్ష్మి, పసునూరి ఉపేందర్, తుపాకుల వెంకటేష్, అబ్బటి బచ్చి రెడ్డి సిబ్బంది భరత్, మల్లేష్, కాంగ్రెస్ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed