- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ధైర్యంగా ఉండండి.. అండగా ఉంటాం...
దిశ, బాసర : ధైర్యంగా ఉండండి.. అండగా ఉంటాం...అని అడిషనల్ కలెక్టర్ పైజాన్ అహ్మద్ హామీ ఇచ్చారు. ఆర్జీయూకేటీ బాసర స్టూడెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, నిర్మల్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం బాసర ట్రిపుల్ ఐటీ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్, అడిషనల్ కలెక్టర్ పైజాన్ అహ్మద్ పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు ధైర్యంగా ఉండాలని, సమస్యలు పరిష్కరించడానికి అధికారులంతా అండగా ఉంటామని తెలిపారు.
ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, విజయాన్ని అందుకునే సమయంలో అనేక సవాళ్లు ఎదురవుతాయని, వాటిని అధిగమించేందుకు అనేక మార్గాలు ఉంటాయని తమ స్వీయ జీవితానుభవాలను తెలిపారు. ఉలి దెబ్బలు తట్టుకుంటేనే రాయి శిల్పంగా మారినట్టు జీవితంలో వచ్చే ఒడిదొడుగులను తట్టుకుంటే ఉన్నత విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రణధీర్ సాగి, అసోసియేట్ స్టూడెంట్ వెల్ఫేర్ డాక్టర్ నాగరాజు, డాక్టర్ పావని, నిర్మల్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.