Sankranthiki Vasthunam: ‘సంక్రాంతికి వచ్చేస్తున్నాం’ ఈవెంట్‌లో షాకింగ్ ఇష్యూ.. మీనాక్షిపై ఐశ్వర్య సీరియస్ (వీడియో)

by sudharani |
Sankranthiki Vasthunam: ‘సంక్రాంతికి వచ్చేస్తున్నాం’ ఈవెంట్‌లో షాకింగ్ ఇష్యూ.. మీనాక్షిపై ఐశ్వర్య సీరియస్ (వీడియో)
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్(Venkatesh) ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam) అనే చిత్రం అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్ ఆకట్టుకున్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(Sri Venkateswara Creations) బ్యానర్‌పై దిల్ రాజు(Dil Raju ), శిరీష్ (Sirish) నిర్మిస్తున్న ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇక ఈ రోజు రిలీజ్ డేట్ ఈవెంట్‌ (Release Date Event)ను ఘనంగా నిర్వహించారు చిత్ర బృందం. ఈమేరకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం సంక్రాంతి స్పెషల్ (Special)గా జనవరి 14న రిలీజ్ కాబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ (Official Announcement) ఇచ్చారు. అనంతరం మీడియాతో ముచ్చటించారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే హీరోయిన్ మీనాక్షి చౌదరి పట్ల ఐశ్వర్య రాజేష్ వ్యవహరించిన తీరు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మేరకు యాంకర్ (anchor).. స్టేజ్ పైకి ఒక్కొక్కరి పిలుస్తుంటోంది. అప్పటికే వెంకటేష్ స్టేజ్ మీదకు వచ్చి కూర్చోగా.. తర్వాత ఐశ్వర్య రాజేష్ వచ్చి వెంకీ పక్కన కూర్చుటోంది. అనంతరం మీనాక్షి చౌదరి వచ్చి వెంకీకి వేరేవైపు కూర్చోంటోంది.

ఈ క్రమంలోనే వెంకీ ఐశ్వర్యను పట్టించుకోకుండా మీనాక్షితో ముచ్చట్లు పెడతాడు. దీనికి కోపం తెచ్చుకున్న ఐశ్వర్య.. మీనాక్షిపై సీరియస్ అయ్యి వెంకీని లేపి తను కూర్చుంటుంది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే.. ఈ సినిమాలో ఐశ్వర్య వెంకీకి భార్య క్యారెక్టర్‌లో నటిస్తుండగా.. మీనాక్షి ప్రియురాలు పాత్రలో నటిస్తుంది. ఇప్పుడు చూసిన సీన్ కూడా సినిమాపై హింట్ ఇస్తూ చేసిందే. అంతే కాకుండా.. చివరిలో వెంకటేష్ ఇది శ్యాంపిల్ (Sample) మాత్రమే అసలైనది సినిమాలో ఉంటోంది. ఈ సారి దిల్ రాజు (Dill Raju) కు బ్లాక్ బస్టర్ హిట్ (blockbuster hit) ఇస్తాం అంటూ చెప్పుకొస్తాడు.

Advertisement

Next Story

Most Viewed