- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖర్చులు తగ్గించేందుకు స్థానికంగా కార్ సెన్సార్ల తయారీ అవసరం: ఇస్రో ఛైర్మన్
దిశ, బిజినెస్ బ్యూరో: దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగానే కార్ సెన్సార్లను తయారు చేయాల్సిన అవసరాన్ని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ బుధవారం ప్రస్తావించారు. బుధవారం బెంగుళూరులో జరుగుతున్న టెక్ సమ్మిట్‌లో స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్‌పై మాట్లాడిన ఆయన.. తక్కువ ఖర్చుతో కూడిన ఉత్పత్తి వల్ల ప్రయోజనాలున్నాయి. రాకెట్ సెన్సార్‌లను ఉత్పత్తి చేయడంలో భారత్ గణనీయంగా పెట్టుబడులు పెడుతుండగా, కార్ సెన్సార్‌లలోనూ ఇది కొనసాగాలి. దేశీయ తయారీ ద్వారా అధిక ఖర్చులను నివారించి లాభదాయకంగా తయారీని మార్చాలని సూచించారు. కార్ సెన్సార్లకు సంబంధించి ఉత్పత్తి వ్యయం తగ్గించి, తయారీని పెంచితేనే సాధ్యమవుతుందని ఆయన వివరించారు. దీని పరిష్కారానికి పరిశ్రమల నుంచి సహకారం అవసరమని సోమనాథ్ కోరారు. ఇదే సమయంలో 2020 స్పేస్ సెక్టార్ సంస్కరణలు, 2023 నాటి స్పేస్ పాలసీ ద్వారా ప్రైవేట్ రంగ వృద్ధికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఈ రంగంలో పెట్టుబడులకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఐదు కంపెనీలు ప్రస్తుతం ఉపగ్రహాలను తయారు చేస్తున్నాయి. ఇవి రాకెట్, ఉపగ్రహాల కోసం సబ్-సిస్టమ్‌లను అభివృద్ధి చేసే సామర్థ్యాన్ని పెంచుతాయని సోమనాథ్ పేర్కొన్నారు.