- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొబైల్ ఛార్జర్ కోసం గొడవ.. చివరకు మహిళ హత్య
దిశ, దుండిగల్ః ఓ మొబైల్ ఛార్జర్ కోసం మొదలైన గొడవ.. చివరకు మహిళ ప్రాణాలు తీసింది. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 23న చోటుచేసుకోగా కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీస్ లు 48 గంటల్లో నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ లో డిసిపి కె.కోటి రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. దుండిగల్ తాండా-2 కు చెందిన జె.శాంతి(45) అదే గ్రామంలో కిరణం కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తుంది. ఆమెకు ఒక కూతురు. భర్త ఇదివరకే చనిపోగా ఒంటరిగా ఉంటుంది. వరంగల్ జిల్లాకు చెందిన రావుల కమల్ కుమార్ (37) ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సూపర్ వైజర్ గా పనిచేస్తూ ఆమె ఇంటి పక్కనే నెల రోజులుగా అద్దెకు ఉంటున్నాడు. ఈ నెల 21న తన మొబైల్ ఛార్జర్ పోయిందంటూ.. నువ్వు తీశావా అంటూ శాంతితో గొడవపడ్డాడు. అంతటితో ఆగని అతను 23న అర్ధరాత్రి వెళ్లి గొడవకు దిగగానే మహిళ ప్రతిఘటించడంతో మద్యం మత్తులో ఆమెను బలంగా తోయడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. ఆమె ఆర్తనాదాలు చేయడంతో ఆమె నోరు, ముక్కు మూయడంతోనే ఊపిరాడక చనిపోయింది. అనంతరం సొంతూరు వెళ్ళాడు. కేసు నమోదు చేసుకున్న పోలీస్ లు సిసి ఫుటేజీ ఆధారంగా ఈ నెల 25న గాగిల్లపూర్ లో అనుమానాస్పందంగా తిరుగుతున్న కమల్ కుమార్ ను అరెస్ట్ చేసి విచారించగా నేరం ఒప్పుకున్నట్లు డీసీపీ స్పష్టం చేశారు. నిందితున్ని రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపాడు. ఏసీపీ శ్రీనివాస రెడ్డి, సిఐ పి.సతీష్ డిటెక్టీవ్ ఇన్స్పెక్టర్ ఎస్.సతీష్, ఎస్ ఐ శంకర్, ఎస్ ఓ టి సిబ్బందిని డీసీపీ అభినందించారు.