- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గోవులను రక్షించేందుకు అందరు భాగస్వామ్యం కావాలి : ఈటల
దిశ, ఘట్కేసర్ : గోవుల సంరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా చేపట్టాలని, మార్వాడి సేవా సమితి ఆధ్వర్యంలో గోమాత వైద్య ఆసుపత్రి నిర్మాణం చేపట్టడం అభినందనీయమని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం పోచారం మున్సిపల్ కొర్రెముల లోని మార్వాడి కమ్యూనిటీ హాల్ లో మార్వాడి సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హాయ్ మాత మందిరం ప్రారంభోత్సవం, గోశాల పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ...మార్వాడీ సమాజం గోమాతను రక్షించేందుకు 4 ఎకరాల స్థలంలో రూ.కోట్లతో గోమాత వైద్య ఆసుపత్రి నిర్మాణం చేయడం గొప్ప విషయం అన్నారు.
అదే విధంగా మల్కాజ్గిరి ఎంపీ గా తన గెలుపు లో మార్వాడి సమాజం కీలక పాత్ర పోషించిందని, వారు చేసే సామాజిక సేవా కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అనంతరం మార్వాడి సమితి సభ్యులు ఎంపీ ఈటలను, బీజేపీ నాయకులను సన్మానించారు. కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్, ఘట్కేసర్ మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి , శామీర్పేట్ మాజీ ఎపీపీ చంద్రశేఖర్ యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు సొల్లేటి కర్ణాకర్, పోలగోని మహేష్ గౌడ్, పొలాగోని వికాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.