- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మూడు చెరువులలో త్రిపుర పాగా..!
దిశ, మేడ్చల్ బ్యూరో: చెరువులు, ప్రభుత్వ స్థలాలే లక్ష్యంగా ప్రాజెక్టులు చేపడుతోంది. విలువైన స్థలాలను కాజేస్తూ అక్రమంగా విల్లాలను నిర్మిస్తోంది. చెరువుల సంరక్షనే ధ్యేయంగా ఒకపక్క హైడ్రా చర్యలు చేపడుతుంటే... మరోపక్క అవేమీ పట్టనట్టు ‘‘త్రిపుర’’ అనే బడా నిర్మాణ సంస్థ బరితెగిస్తోంది.ఏకంగా మూడు చెరువుల ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ల స్థలాలతోపాటు వాటి పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను సైతం కలిపేసుకుంటూ“త్రిపుర ల్యాండ్ మార్క్ 5 “ పేరిట విల్లాలను నిర్మాణానికి పూనుకుంటుంది. ఈ ప్రాజెక్ట్ లో దాదాపు రూ.300 కోట్లకు విలువైన 15 ఎకరాల చెరువులు, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేడ్చల్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ గండి మైసమ్మ మండలం దొమ్మర పోచంపల్లి లో “త్రిపుర” నిర్మాణ సంస్థ చేపడుతున్న “త్రిపుర ల్యాండ్ మార్క్ 5 ’’ పై ప్రత్యేక కథనం ...
చెరువులే లక్ష్యంగా..
దుండిగల్ మున్సిపాలిటీ దొమ్మర పోచంపల్లి గ్రామ రెవెన్యూ సర్వే నెంబరు 183/p , 184/p, 187/p, 188/p లో ఉన్న 15 ఎకరాల 27.5 గుంటల స్థలంలో త్రిపుర కన్స్ట్రక్షన్స్ నిర్మాణ సంస్థ ‘త్రిపుర ల్యాండ్ మార్క్ 5’ ప్రాజెక్టు పేరిట ఇండిపెండెంట్ విల్లాలు నిర్మాణం చేపట్టింది. అయితే అనుమతులు తెచ్చుకునే సందర్భంలో పేర్కొన్న సర్వే నెంబర్ల తో పాటుగా సమీపంలోనే ఉన్న చెరువులకు చెందిన ఎఫ్.టి.ఎల్, బఫర్ జోన్ ప్రాంతాలను సైతం కలిపేసుకుంటూ ప్రస్తుతం నిర్మాణాలు కొనసాగుతున్నాయి. త్రిపుర ల్యాండ్ మార్క్ 5 ప్రాజెక్టు లో మొత్తం మూడు చెరువులు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. వాటిలో…
పడగ సముద్రం చెరువు…
సర్వే నెంబర్ 181, 182, 199లో ఆరున్నర ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పడగసముద్రం చెరువు ఉంది.కాగా 90 శాతం చెరువు సర్వేనెంబర్ 181 లోనే విస్తరించి ఉండగా, మిగిలిన 182,199 సర్వే నెంబర్లలో బఫర్ జోన్ ప్రాంతాలు ఉన్నాయి. అయితే ఈ చెరువును ఆనుకొని సర్వేనెంబర్ 183 ఉండగా, త్రిపుర ల్యాండ్ మార్క్ 5 నిర్మాణాలు కోసం ఇదే 183 సర్వే నెంబర్ లో అనుమతులు తీసుకుంది.అయితే సర్వే నెంబర్ 183 పక్కనే ఉన్న చెరువు సర్వేనెంబర్ 181 పడగ సముద్రం ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ప్రాంతాలను కలుపుకుంటూ విల్లాలను నిర్మిస్తోంది.
మొండికుంట చెరువులో..
బోరం పేట గ్రామ రెవెన్యూ పరిధి లో ఉన్న మొండికుంట చెరువు ఎఫ్ టి ఎల్ బఫర్ జోన్ ప్రాంతాలను సైతం త్రిపుర ల్యాండ్ మార్క్ ఆక్రమించింది. ప్రాజెక్టుకు వెనకవైపుగా వచ్చే ఈ ప్రాంతంలో దాదాపు 15 వందల గజాల భూమి చెరువు ఎప్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతంలోకి వస్తున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
సర్వేనెంబర్ 188 లో వాటర్ బాడీ..
తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటివల చెరువులు అన్యాక్రాంతంపై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులు ప్రదర్శించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో దొమ్మర పోచంపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 188 లో ఒక ఎకరం విస్తీర్ణంలో వాటర్ బాడీ ఉండేదని స్పష్టం చేశారు. ఒక ఎకరం ఒక గుంట విస్తీర్ణంలో ఉన్న ఈ వాటర్ బాడీ 2014 సంవత్సరానికి ముందు ఎటువంటి అన్యాక్రాంతానికి గురి కాలేదని 2023 లో 43 శాతం గుంటల చెరువు వాటర్ బాడీ కబ్జాకు గురైనట్లుగా ఆ నివేదికలో తెలిపారు. అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో అధికారులు పేర్కొన్న ప్రాంతం లో ఇప్పుడు ‘‘త్రిపుర ల్యాండ్ మార్క్ 5’’ పేరిట విల్లాలు నిర్మిస్తున్నారు. 41 గుంటల విస్తీర్ణంలో ఉన్న ఈ వాటర్ బాడీ ప్రస్తుతం త్రిపుర ల్యాండ్ మార్క్ ఆధీనంలో ఉండటం గమనార్హం.
ప్రభుత్వ భూమి సైతం..
చెరువుల ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ప్రాంతాలే కాకుండా త్రిపుర ల్యాండ్ మార్క్ 5 ప్రాజెక్టు నిర్మాణంలో ప్రభుత్వ భూమి సైతం అన్యాక్రాంత నికి గురైంది. దొమ్మర పోచంపల్లి సర్వే నంబర్ 181 లో 8 ఎకరాల 24 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఈ సర్వే నెంబర్ కు ఆనుకునే ఉన్న 183 లో త్రిపుర నిర్మాణ సంస్థ అనుమతులు తీసుకుని ప్రభుత్వ భూమి అయిన సర్వేనెంబర్ 181 నీ కూడా ఆక్రమించి నిర్మాణాలను చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సర్వే నెంబర్ లో మొత్తం 8 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉండగా, దానిలో 2 వేల గజాలకు పైగా భూమి త్రిపుర నిర్మాణ సంస్థ ఆధీనంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా దుండిగల్ మండలం దొమ్మర పోచంపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో త్రిపుర ల్యాండ్ మార్క్ 5 ప్రాజెక్టు నిర్మాణాలు మూడు చెరువుల ఎఫ్టిఎల్ బఫర్ జోన్లతో పాటుగా ప్రభుత్వ భూమిని సైతం ఆక్రమించి నిర్మాణాలు చేపడుతుందని వీటిని వెంటనే అడ్డుకొని సదరు నిర్మాణ సంస్థ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.