RajNath Singh : కోటి దీపోత్సవానికి హాజరైన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

by M.Rajitha |
RajNath Singh : కోటి దీపోత్సవానికి హాజరైన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవ(Koti Deepotsavam) కార్యక్రమానికి నేడు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(RajNath Singh) ముఖ్య అతిధిగా హాజరయ్యారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న కేంద్రమంత్రికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy), ఎంపీ లక్ష్మణ్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా కోటి దీపోత్సవ ప్రాంగణానికి చేరుకున్న కేంద్రమంత్రికి పండితులు, నిర్వాహకులు ప్రత్యేక ఆహ్వానం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక కార్తీక దీపాలు వెలిగించి, పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. రక్షణ మంత్రిగా దేశ సరిహద్దులు కాపాడటం నా బాధ్యత. దేశ సరిహద్దులు కాపాడటం ఎంత ముఖ్యమో.. దేశంలో సంస్కృతిని కాపాడటం కూడాఆ అంతే అవసరం అని పేర్కొన్నారు. ఆ పనిని భక్తి టీవీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ తోపాటు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ పాల్గొనగా.. పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు.

Advertisement

Next Story