ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిస్తాం

by Naveena |
ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిస్తాం
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: హైకోర్టు ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ బీసీ కమిషన్ గా తనను నియమించిందని కమిషన్ బుసాని వెంకటేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల నిర్థారణ కోసం ఉమ్మడి జిల్లాలోని వివిధ బీసీ కులాల అభిప్రాయ సేకరణ కోసం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో..సోమవారం ఆయన,కమీషన్ కార్యదర్శి బి.సైదులు తో కలసి బహిరంగ విచారణ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఇంతవరకు 5 జిల్లాల ప్రజల అభిప్రాయాలను సేకరించామని,నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జోగులాంబ గద్వాల,వనపర్తి,నాగర్ కర్నూల్,నారాయణపేట,మహబూబ్ నగర్ జిల్లాలోని 69 కులాలు,కుల సంఘాల నేతలు,తమ తమ అభిప్రాయాలను వెల్లడించాలన్నారు. వారి అభిప్రాయాలు,వినతి పత్రాలను పరిగణలోకి తీసుకొని సమగ్ర నివేదికను నెల రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన తెలిపారు. అంతకుముందు గౌడ,ముదిరాజ్,నాయి బ్రాహ్మణులు,వీరశైవ లింగాయత్-లింగ బలిజ,మున్నూరు కాపు,కమ్మరి,విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ, సేవకులు తదితర 69 కూలాల వారిగా తమ వాదనలు వినిపించి,తమ కులాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి,అదనపు కలెక్టర్ మోహన్ రావు,ఏఓ శంకర్ తదితరులు పాల్గొన్నా

Advertisement

Next Story

Most Viewed