- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రతి పౌరుడూ యూనిఫామ్ లేని పోలీసే
దిశ,మేడ్చల్ టౌన్ : ప్రతి పౌరుడు యూనిఫాం లేని పోలీసు అని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి అన్నారు. గురువారం మేడ్చల్ పట్టణంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ ను మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ప్రతి పౌరుడు సమాజంలో జరిగే అసాంఘిక కార్యకలాపాల సమాచారం సేకరించడంతో పాటు పోలీస్ లకు ఆ సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత ఉందని అన్నారు.
ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. గంజాయి ,మత్తు పదార్థాలు ఇంతకుముందు పట్టణాలలో ఉండేదని ఇప్పుడు గ్రామాలకు కూడా పాకిందని, వాటన్నిటికీ యువత దూరంగా ఉండాలని అన్నారు. అంతేకాకుండా మానవ తప్పిదాల వల్ల రోడ్డు ప్రమాదం జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధన పాటించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ సత్యనారాయణ, డీఐ వెంకట్ రెడ్డి, ఏఎస్ఐ ఆనంద్ కుమార్ , పాఠశాల ఉపాధ్యాయులు పద్మనాభం తదితరులు పాల్గొన్నారు.
- Tags
- DCP Kotireddy