ఎరిన్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో అగ్నిప్రమాదం

by John Kora |
ఎరిన్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
X

దిశ, పటాన్‌చెరు: కెమికల్ పరిశ్రమలో పదార్థాలు అన్ లోడ్ చేస్తుండగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు, ఇద్దరు కెమిస్ట్‌లు, ఇద్దరు వర్కర్లు గాయపడ్డ శుక్రవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పారిశ్రామికవాడలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలోని ఎరిన్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలోని ఎఫ్ బ్లాక్ లోని ఏఎన్ఎఫ్డీ డ్రయర్ లో ఎం బేస్ పదార్థం అన్ లోడ్ చేస్తుండగా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యి అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో ఎఫ్ బ్లాక్ లో ఉన్న నలుగురు కార్మికులు అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు. గాయపడ్డ కార్మికులు కెమిస్ట్ లు నితీష్ పండిట్, పవన్ కుమార్, వర్కర్లు ధని లాల్ సింగ్, అమర్ సింగ్ లను చికిత్స నిమిత్తం పరిశ్రమ సిబ్బంది ఇస్నాపూర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్య చికిత్స కోసం కార్మికులను హైదరాబాద్ ఆస్పత్రికి పంపించారు.

Next Story

Most Viewed