ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : ఎమ్మెల్యే మర్రి

by Aamani |
ప్రజా సమస్యల పరిష్కారానికి  కృషి :  ఎమ్మెల్యే మర్రి
X

దిశ, మల్కాజిగిరి : నియోజకవర్గంలోని అన్ని కాలనీల్లో నెలకొన్న సమస్యలన్ని దశల వారీగా పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మల్కాజిగిరి సర్కిల్ గౌతంనగర్ డివిజన్ లోని మిర్జాలగూడలో కొనసాగుతున్న ఆర్ సీసీ పైపులైను పనులను స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీలోని ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళిక బద్ధంగా పనులను చేపడుతున్నామన్నారు. కాలనీ సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామన్నారు. నాయకులు రాము యాదవ్ , పార్టీ కార్యకర్తలు , నాయకులు, కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Next Story