- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉప్పల్‌లో క్రెడాయ్ ఆధ్వర్యంలో ఈస్ట్ హైదరాబాద్ ప్రాపర్టీ షో
దిశ,ఉప్పల్ : ఉప్పల్ నాగోల్ మెట్రో స్టేషన్ గ్రౌండ్ క్రెడాయ్ (CREDAI) ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో నిర్వహించారు.ఈ నెల 23 నుంచి 25 వరకు ఈస్ట్ హైదరాబాద్ ప్రాపర్టీ షో కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐటీ శాఖ మంత్రి మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హాజరై ప్రాపర్టీ షో ను ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఏర్పడటం ద్వారా రియలేస్టేట్ రంగంపై కస్టమర్లకు అనుమానాలు, అపోహలు వద్దన్నారు. నార్త్ తో పాటు హైదరాబాద్ కి నలువైపులా అన్ని ప్రాంతాలలో రియలేస్టేట్ అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పడుతుందన్నారు.
రియల్ ఎస్టేట్ రంగమే కాదు అన్ని రంగాలను అభివృద్ధి పరచడే మా ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. ఈస్ట్ హైదరాబాద్ లో ఐటీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.జనాభా పాపులేషన్ దృష్టిలో పెట్టుకొని ఈస్ట్ హైదరాబాద్ లో కన్వెన్షన్ సెంటర్ లను ఏర్పాటు చేసే ప్రక్రియను సాంక్షన్ చేసే విధంగా ముందుకు వెళ్తున్నామని మంత్రి తెలిపారు. రాజకీయ కక్షాలకు పోకుండా తెలంగాణ అభివృద్ధి కోసమే పాటుపడతామని అన్నారు.రాష్ట్ర పరిపాలన ద్వారా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది, వేగంగా విస్తరిస్తోందన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,నేను ఇటీవల యూఎస్,దక్షిణ కొరియా పర్యటనలో, రూ.31,500 కోట్లు(సుమారుగా) పెట్టుబడులను తీసుకొచ్చామన్నారు. ఐటిఈఎస్,ఏఐ,ఫార్మాస్యూటికల్స్,లైఫ్ సైన్సెస్,రీసెర్చ్, ఎలక్ట్రికల్ వెహికల్స్, డేటా సెంటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్,వివిధ సాంకేతిక రంగాలలోని ప్రపంచ వ్యాపార సమాజానికి హైదరాబాద్ 4.0 యొక్క లక్ష్యంను సాధించే దిశగా వెళుతున్నామన్నారు. ఇది తక్షణమే దాదాపు 30,750 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందన్నారు.
ఈ పునరుజ్జీవనం తో రియల్ ఎస్టేట్ రంగం మరింతగా అభివృద్ధి చెందుతుందని కొనియాడారు.ఉన్నత కుటుంబాలకు, మధ్యతరగతి కుటుంబాలకు ఎవరికైనా సమాజంలో స్థిరపడ్డామంటే సొంత ఇల్లు ఉంటేనే స్థిరపడ్డట్టు అని భావిస్తారు. అయితే సింగిల్ బెడ్ రూమ్ కొన్నమా,డబుల్ బెడ్ రూమ్ కొన్నామా, త్రిబుల్ బెడ్ రూమ్ కొన్నమా ఇండిపెండెంట్ హౌస్ కొన్నమా అనేది కాకుండా ఒక చినుకైనా బంగారం కొనాలని లేదంటే ఒక చిన్న బెడ్ రూమ్ ఇల్లు అయినా కొనాలని ప్రతి ఒక్కరి మనసులో ఉంటుందన్నారు.సీఎం రేవంత్ రెడ్డి,నేను ఆలోచనలు చేసి పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లో కూడా బిల్డింగ్ యాక్టివిటీ పెద్ద ఎత్తున చేపట్టాలని దృక్పథంతో ముందుకు వెళ్తున్నాం.కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు కొన్ని ఆటంకాలు,అనేక సందేహాలు,అపోహలు ఉంటాయి.మా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాం.మంచి పనులు గత ప్రభుత్వాలు చేస్తే ఇంకా రెట్టింపు ఆలోచనలతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు.
రాజకీయాలను పక్కనపెట్టి ఈ ప్రాంతం,ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆలోచన దృక్పథంతో ముందుకు పోతున్నామని అన్నారు.ముఖ్యమంత్రి కానీ నేను కానీ ఏదైనా మాట ఇస్తే పూర్తి స్థాయిలో ఆచరణలో పెట్టే ప్రయత్నం తప్పకుండా చేస్తామని,గత ప్రభుత్వం ఎం హామీలు ఇచ్చిందో దాన్ని కూడా రాజకీయాలకు పోకుండా ప్రాపర్టీ డెవలపర్స్ కు సంబంధించి,రియల్ ఎస్టేట్ కు సంబంధించి మీరు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో కస్టమర్ సంతోషం గురించి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ , టాక్స్ అంశాల విషయంలో మినాయింపులే కానీ,మూసీ నది పక్కన కొన్ని స్థలాల సంబదించిన అంశాల విషయమే కానీ తప్పకుండా వాటిని పరిగణలోకి తీసుకొని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని క్రెడాయ్ సభ్యులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో క్రెడయి హైదరాబాద్ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి,ఎలక్ట్ క్రెడై ప్రెసిడెంట్ జైదీప్ రెడ్డి, క్రేడై సెక్రెటరీ జగన్నాధ రావు,పలు రియలేస్టేట్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.