ఆత్మహత్య చేసుకున్న డిగ్రీ స్టూడెంట్

by Nagam Mallesh |
ఆత్మహత్య చేసుకున్న డిగ్రీ స్టూడెంట్
X

దిశ, ఉప్పల్: స్నేహితుని బర్త్ డే పార్టీలో ఆనందంతో గడిపిన డిగ్రీ స్టూడెంట్ తెల్లవారుజామున ఉరేసుకొని మృతి చెందిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం చిలకనగర్ అబ్దుల్ కలాం విగ్రహం దగ్గర నివసిస్తున్న సంధం బిక్షపతి సోమవారం తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో నిద్రలేచి బాత్రూంకి వెళ్దామని చూసేసరికి తన పెద్ద కుమారుడు సందం లోక్ షిత్ (18) ఇంట్లో ఫ్యాన్ కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుమారుని మృతికి ఎలాంటి కారణాలు తెలియవని దానిపై ఎలాంటి సందేహాలు లేవని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మధు తెలిపారు.

Advertisement

Next Story