'కాంగ్రెస్ బైక్ ర్యాలీకి పిలిచి డబ్బులివ్వలేదు’

by Aamani |
కాంగ్రెస్ బైక్ ర్యాలీకి పిలిచి డబ్బులివ్వలేదు’
X

దిశ, కాప్రా : ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందమల పరమేశ్వర్ రెడ్డి గురువారం నామినేషన్ సందర్భంగా సైనిక్ పురి చౌరస్తా నుంచి ఉప్పల్ మున్సిపల్ కార్యాలయం వరకు నిర్వహించిన బైక్ ర్యాలీ కోసం వచ్చిన కార్యకర్తలకు మొండి చేయి చూపించారంటూ రాధిక చౌరస్తాలో ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరమేశ్వర్ రెడ్డి నామినేషన్ పురస్కరించుకుని భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ కొసం నాగారం, దమ్మాయిగూడ ప్రాంతాల నుంచి ఒక్కొక్కరికి రూ. 800 ఇస్తామని పిలిపించి, పైసా కూడ ఇవ్వలేదని బాధితులు ఇస్తామన్న డబ్బులు ఇవ్వకుండా రూ 400 ఇస్తామంటూ తప్పించుంటున్నారనీ, కూలీ పని వదులుకుని వస్తే తిండి లేక, నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నా డబ్బులివ్వడం లేదన్నారు.

సుమారు 150 మంది వస్తే పైసా కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్నారన్నారు. అటూ కూలీ పోయే , బైక్ లో పెట్రోల్ కూడా తమ సొంత డబ్బులే పెట్టుకున్నామని వాపోతున్నారు. పార్టీ కోసం తమను తీసుకొచ్చి డబ్బులివ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఏలాగైనా తమకిస్తామన్న డబ్బులు ఇప్పించాలని కోరుతున్నారు. అయితే సదరు పార్టీ నాయకులు తీరా మీ ఇష్టం వచ్చింది చేసుకొండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని చెబుతున్నారు.

Advertisement

Next Story