BREAKING: మేడ్చల్ జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు.. అత్యాచారం కేసులో నిందితుడికి బిగ్ షాక్

by Shiva |
BREAKING: మేడ్చల్ జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు.. అత్యాచారం కేసులో నిందితుడికి బిగ్ షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మహిళలు, యువతులపై అత్యాచారాలు కొనసాగుతున్న వేళ మేడ్చల్ జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 2017లో 8 ఏళ్ల బాలికపై పొరుగింటి యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. అయితే, అప్పటి నుంచి కేసు వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇరు పక్షాల వాదనలు విన్న మేడ్చల్ జిల్లా పోక్సో కోర్టు జడ్జి గురువారం తన తుది తీర్పును వెలువరించారు. ఈ మేరకు బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్ష, రూ.3 లక్షల జరిమానాను విధిస్తూ జడ్జి సంచలన తీర్పును వెలువరించారు.

Advertisement

Next Story

Most Viewed