బెట్టింగ్ లకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్..

by Kalyani |
బెట్టింగ్ లకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్..
X

దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి: ఆన్ లైన్ లో క్రికెట్ బెట్టింగ్ లను ప్రోత్సహిస్తూ, బెట్టింగ్ లకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని బోయిన్ పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బోయిన్ పల్లి ఇన్ స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బోయిన్ పల్లికి చెందిన చింతల సాయి కిరణ్ (29 ) డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సాయి కిరణ్ కు ఆన్ లైన్ లో ఓ వ్యక్తి పరిచయం కావడంతో అతని ద్వారా ఐపీఎల్ లీగ్స్ సంబంధించిన క్రికెట్ బెట్టింగ్ ల లింకును పొందాడు. ఈ లింక్ ద్వారా ఐపీఎల్ మ్యాచ్ బెట్టింగ్ లు ఆడుతూ ఉన్నాడు.

అలాగే ఆర్ సీబీ, సీఎస్ కె మ్యాచ్ లకు సంబంధించిన బెట్టింగ్ ల లీక్ తన వద్ద ఉందంటూ తనకు తెలిసినవారిని బెట్టింగ్ లకు పోత్సహించడానికి ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలో బెట్టింగ్ లింక్ లను పొందిన ఓ వ్యక్తి ఈ విషయం పైన సాయికిరణ్ పై బోయిన్ పల్లి పాలీసులకు సమాచారంతో పాటు సాయికిరణ్ బోయిన్ పల్లి లోని హనుమాన్ టెంపుల్ వద్ద ఉన్నాడని పక్కా సమాచారం అందించాడు. దీంతో సాయి కిరణ్ ఉన్న స్థలానికి చేరుకున్న ఎస్ఐ యుగేందర్ సాయికిరణ్ ను అదుపులోకి తీసుకుని అతనివద్ద ఉన్న సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకుని విచారించగా సాయి కిరణ్ బెట్టింగ్ లకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. ఈ మేరకు పోలీసులకు సాయి కిరణ్ పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story